సినిమా విజయంలో సంగీతం కీలక పాత్ర వహిస్తుంది. చాలా సినిమాలకి సంగీతం ప్లస్ గా మారి అనుకున్నదానికంటే ఎక్కువ కలెక్షన్లు సాధిస్తుంటాయి. కొన్ని సినిమాలు మ్యూజిక్ కారణంగానే ఎక్కువ రోజులు గుర్తుండిపోతాయి. ఎన్నో సినిమాలు కథగా ఫెయిలైనా మ్యూజిక్ పరంగా మ్యాజిక్ చేస్తుంటాయి. అయితే దక్షిణాదిన పేరు మోసిన మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరని అడిగితే టక్కున గుర్తుకొచ్చే పేర్లు ఒకటి ఏ ఆర్ రెహమాన్. రెండు ఇళయరాజా.

 

 

ఆస్కార్ గెలిచిన తర్వాత రెహమాన్ ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇక ఇళయరాజాకి అభిమానించే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి జెనరేషన్ సైతం పాత పాటలు వింటున్నారంటే అవి ఖచ్చితంగా ఇళయారాజా స్వర కూర్చినవే అయ్యుంటాయి. అయితే తెలుగులో సంగీత దర్శకులలో అగ్రగణ్యులుగా పేరొందుతున్న వారిని చూసుకుంటే ఇద్దరు కనిపిస్తారు.

 

దేవి శ్రీ ప్రసాద్, థమన్. వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా విపరీతమైన పోటీ నడుస్తోంది. మొదట్లో ఆ పోటీలో దేవిశ్రీ థమన్ పై పైచేయి సాధించినప్పటికీ.. ప్రస్తుతం దేవీశ్రీని దాటి థమన్ వెళ్ళిపోయాడు. అల  వైకుంఠపురములో మ్యూజిక్ బ్లాక్ బస్టర్ అవడంతో అతని పేరు మారుమోగిపోతుంది. అయితే ఇప్పుడు వీరిద్దరికి పోటీగా మరొకరు రాబోతున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ కొడుకు మహతి సాగర్ వీరికి పోటీగా నిలవబోతున్నాడు. 

 

 

ఛలో చిత్రంలో చూసీ చూడంగానే అంటూ అదిరి పోయే క్లాసిక్ సాంగ్ కి కంపోజ్ చేసిన అతడి భవిష్యత్ పై అంచనాలేర్పడ్డాయి. ఇటీవల భీష్మ పాటలతోనూ మరిపిస్తున్నాడు. వాటే బ్యూటీ... సింగిల్ ఆంథెమ్ .. సరా సరి పాటలు శ్రోతల్లోకి దూసుకెళ్లాయి. క్రియేటివిటీ కంటే క్లారిటీ అతడి మ్యూజిక్ కి ప్లస్ అన్న ప్రశంసా దక్కింది. అనవసర రణగొణ ధ్వనులు వినిపించకుండా చక్కని క్లారిటీ తో అతడి ట్యూన్ ఆకట్టుకుంటోంది. అందుకే అతడికి మునుముందు మంచి భవిష్యత్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. భీష్మ సినిమాతో తన బాణీ వినిపించిన మహతి దేవి శ్రీ ప్రసాద్, థమన్ లకి పోటీగా నిలుస్తానడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: