సినిమా రంగంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. కొన్నిసార్లు హిట్లు కొడితే మ‌రి కొన్ని సార్లే ఫ్లాప్‌లు ఎదుర‌వుతాయి. బ‌ళ్ళు ఓడ‌ల‌వుతాయి అని ఊరిక‌నే అంటారా. ఇక ఒకొక్క‌ళ్ళ‌కి ఒక్కో టైం క‌లిసొస్త‌ది. ద‌ర్శ‌కులు హీరోలుగా మారిన రోజులు చాలానే ఉన్నాయి. కానీ అది అంద‌రికీ వ‌ర్క్ అవుట్ అవ‌దు. గ‌తంలో ఎస్‌.వీ. కృష్ణారెడ్డి కూడా హ‌రోగా ఒక మూడు నాలుగు చిత్రాల్లో న‌టించారు. ప‌ర్వాలేద‌నిపించుకున్నారు. మ‌ళ్ళీ ఇప్పుడు లేటెస్ట్‌గా మాస్ సినిమాల‌ను తెర‌కెక్కించే అద్భుత‌మైన ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ హీరోగా అవ‌తార‌మెత్తిన సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రం పేరు సీన‌య్య‌. ఇక ఈ చిత్రాన్ని నిర్మాత దిల్‌రాజు చేస్తున్నారు. 

 

అయితే ఈ చిత్రం కోసం వి.వి. వినాయ‌క్ ఎంతో క‌ష్ట‌ప‌డి త‌న వెయిట్‌ని లాస్ చేసుకున్నారు. దాదాపు ఈ సినిమా కోసం ఆయ‌న 10 కేజీల వ‌ర‌కు వెయిట్ త‌గ్గారు. ఇక ఇదిలా ఉంటే... ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ మొత్తం దాదాపు పూర్త‌యి విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే దీన్ని చూసిన దిల్‌రాజు మాత్రం శాటిస్‌ఫైగా లేడ‌ట‌. అందుకే మ‌ళ్ళీ రెండు మూడు నెల‌ల నుంచి తిరిగి మ‌ళ్ళీ రీ షూట్ చేశార‌ట‌. అయినా కూడా దిల్‌రాజుని మెప్పించ‌లేక‌పోయారు. ఇక ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు న‌ర‌సింహ తెర‌కెక్కించారు. 

 

దిల్‌రాజు సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న పేరు ఒక‌టి మార్కెట్‌లో ఉంటుంది. అందుకే ఏదైనా సినిమా చేసేట‌ప్పుడు ప‌ది సార్లు ఆలోచించి అడుగువేస్తాడు దిల్ రాజు. అలాగే ద‌ర్శ‌కుడిగా త‌న‌కు మొద‌టి అవ‌కాశం ఇచ్చిన నిర్మాత మాట కాద‌న‌లేక పాపం వినాయ‌క్ ఈ చిత్రంలో హీరోగా చెయ్య‌డానికి ఒప్పుకున్నాడు. దారి కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి వెయిట్ లాస్ కూడా అయ్యారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం అట‌కెక్కేలా ఉంది. దిల్‌రాజు సినిమా బాలేదు కాబ‌ట్టి ప్ర‌స్తుతం విడుద‌ల చెయ్య‌డానికి పెద్ద‌గా ఆశ‌క్తి చూప‌డం లేద‌ట‌. సినిమా అస్స‌లు బాలేద‌ని క‌థ బావున్నా స్క్రీన్‌ప్లే మాత్రం కుద‌ర‌లేద‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రి అస‌లే ఈ మ‌ధ్య సినిమాలు లేక ఫ్లాపుల మీద ఫ్లాపులు తీస్తున్న వినాయ‌క్‌కి హీరోగా అయినా కొంత పేరు వ‌స్తుందోమో అని అనుకుంటుంటే స‌డెన్‌గా ఇలా జ‌రిగేస‌రికి ఆయ‌న తెగ ఫీల‌యిపోతున్నార‌ట‌. మ‌రి చివ‌రికి ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: