ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా రిమేక్ చిత్రాలపై ఫోకస్ చేస్తున్నారు.  బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన చిత్రాలు తెలుగు లో రిమేక్ చేసే పనిలో ఉంటున్నారు ఇక్కడ దర్శక, నిర్మాతలు.  అయితే ఇలా రిమేక్ అయిన మూవీస్ తెలుగు లో మంచి హిట్ అవుతున్నాయి..కొన్ని చిత్రాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటున్నాయి. ఆ మద్య రామ్ చరణ్ కోలీవుడ్  సూపర్ హిట్ చిత్రం 'తని ఒరువన్'కి రిమేక్ గా తెలుగు లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ధృవ’ మంచి విజయం అందుకుంది.  తమిళ్ లో విజయ్ నటించిన కత్తి చిత్రం తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి, వివివినాయర్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ గా రిమేక్ చేశారు.  ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. 

 

ప్రస్తతం విక్టరీ వెంకటేష్ తమిళో లో హిట్ అయిన ‘అసురన్’ మూవీ తెలుగు లో రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళనాట 2017లో విడుదలైన విజయవంతమైన 'విక్రమ్ వేద' మూవీ రిమేక్ చేయాలనే యోచనలో ఉన్నట్లు టాలీవుడ్ టాక్. పుష్కర్ - గాయత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, మాధవన్ - విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటించారు.  వైవిధ్యభరితంగా మలచబడిన ఈ రెండు పాత్రలు చిత్రం విజయంలో కీలకమైన పాత్రను పోషించాయి. అలాంటి ఈ  చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ వారు రీమేక్ చేయాలనుకున్నారు. ప్రధాన పాత్రలకి గాను రానా - రవితేజ పేర్లు వినిపించాయి.

 

కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ విషయం పక్కన బెట్టారు. ప్రస్తుతం రవితేజకు మార్కెట్ డౌన్ లో ఉంది. అయితే రిమేక్ విషయం మళ్లీ తెరపైకి వచ్చిందట. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ రిమేక్ పై మళ్లీ దృష్టి పెట్టారట. అయితే మాధవన్ పాత్ర రామ్ చరణ్ చేస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నారట. మరో పాత్రను రవితేజతో చేయిస్తారా? రానాను తీసుకుంటారా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది. 2022లో ఈ ప్రాజెక్టు పట్టాలపైకి వెళుతుందని చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: