సినిమా ఇండ‌స్ట్రీ అంటేనే మూడు నాళ్ళ ముచ్చ‌ట అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. కానీ కొంత మంది హీరోలు, హీరోయిన్లు మాత్రం ఎంతో హైప్ వ‌చ్చి కెరియ‌ర్‌లో నిల‌దొక్కుకుంటారు అనే స‌మయంలో ప‌త్తాలేకుండా పోతున్నారు. కానీ వారిని అప్పుడో ఇప్పుడో చూసిన ప్రేక్ష‌కులు మాత్రం మ‌రిచిపోవ‌డం లేదు. అలా స్టార్ డ‌మ్ రావాల్సిన కూడా అడ్ర‌స్ గ‌ల్లంతైన వ్య‌క్తులు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం. వేణు తొట్టెంపూడి ఒక‌ప్పుడు హీరోగా ఎన్నో సూప‌ర్‌హిట్ చిత్రాల్లో న‌టించాడు. వేణు న‌టించిన ఆఖ‌రి చిత్రం రామాచారి. త‌ర్వాత ఎన్టీఆర్ న‌టించిన ద‌మ్ము చిత్రంలో గెస్ట్ రోల్‌లో క‌నిపించారు. ఆ త‌ర్వాత ఈ న‌టుడు సినిమాల‌కు పూర్తిగా దూర‌మ‌య్యాడు. మంచి మంచి క‌థ‌ల‌ను ఎంచుకుంటూ చాలా చ‌క్క‌గా చేసేవాడు. ఓ చిన్న సైజు కామెడీ హీరోగా భ‌లే సెటిల‌య్యాడే అనుకున్నారు అంద‌రూ. మ‌రో రాజేంద్ర‌ప్ర‌సాద్ అనుకున్నారు అంద‌రూ ఇంత‌లో ఏమైందో ఏమోగాని స‌డెన్‌గా డ్రాప్ అయ్యారు. 

 

ఇక త‌రుణ్ ఒకప్ప‌టి అమ్మాయిల డ్రీమ్ బాయ్ పేరు తెచ్చుకున్నాడు. ప్రేమ‌క‌థా చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచాడు. బాల‌న‌టుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన త‌రుణ్ నువ్వేకావాలి చిత్రంతో హీరోగా లైమ్‌లైట్‌లోకి వ‌చ్చాడు. ఎన్నో హిట్ మూవీస్‌లో న‌టించాడు. శ‌శిరేఖా ప‌రిణ‌యం చిత్రం ఫ్లాప్ అవ్వ‌డంతో తిరిగి నాలుగేళ్ళ వ‌ర‌కు మ‌ళ్ళీ క‌నిపించ‌లేదు. ఇటీవ‌లె ఇది నా ల‌వ్‌స్టోరీ అంటూ చేశాడు కానీ పూర్తి అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచింది ఆ చిత్రం.  వ‌డ్డేర‌మేష్ నిర్మాత కొడుకుగా వ‌డ్డే న‌వీన్ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా పెళ్ళి త‌దిత‌ర చిత్రాలు ఎన్నో చేశాడు. హీరోగా ఆఖ‌రి సినిమా శ్రీ‌మ‌తి క‌ళ్యాణంలో న‌టించాడు. ఆ త‌ర్వాత అడ్ర‌స్సే లేడు వ‌డ్డే న‌వీన్‌. ఆ త‌ర్వాత జై ఆకాష్ కూడా శ్రీ‌లంక‌న్ ఇండియ‌న్ ఫిల్మ్ యాక్ట‌ర్ ఆనందం అనే హిట్ మూవీతో ప‌రిచ‌యం అయ్యాడు. 2009లో ఆ ఇద్ద‌రు సినిమా త‌ర్వాత మ‌ళ్ళీ క‌నిపించ‌లేదు ఆకాష్‌. ఇక తార‌క ర‌త్న సంగ‌తి స‌రే స‌రి. 

 

ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన తొలినాళ్ళ‌లోనే అత్య‌ధిక సినిమాల‌ను ప్ర‌క‌టించుకున్న ఏకైక హీరో తార‌క్‌. యువ‌ర‌త్న సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భ‌క్త సిరియా లాంటి భ‌క్తి ర‌సాల‌ను పోషించిన ఈ హీరో ఇప్పుడు ప‌త్తా లేకుండా పోయాడు. ఫైన‌ల్ గా నెగిటివ్ రోల్స్ లో కూడా న‌టించాడు. కానీ ఎక్కువ కాలం అందులో కొన‌సాగించ‌లేక‌పోయారు. ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా ఎటువంటి ఫ‌లితం లేక‌పోయింద‌న్న ముద్ర వేయించుకున్నారు ఈ హీరో. రాజా ఫీల్ గుడ్ చిత్రాల న‌టుడు. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆనంద్ చిత్ర‌మైతే మంచి హిట్ అయింది. ఆ త‌ర్వాత కొన్ని చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఆయ‌న ఇండ‌స్ట్రీలో అయితే క‌నిపంచ‌డం లేద‌నే చెప్పాలి. హ్యాపీడేస్‌లో న‌టించిన రోహిత్‌, రాహుల్‌రెడ్డి వీళ్ళంతా కూడా అదే కోవ‌కి చెందిన వాళ్ళు. ఇక వీళ్ళంరూ ఇప్పుడు చూద్దామ‌న్నాక‌నీసం మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేదు. అప్ప‌ట్లో వీరి సినిమాల‌కు ఫిదా అయిన కొంత మంది ప్రేక్ష‌కులు ఎక్క‌డైనా స‌రే సైడ్ క్యారెక్ట‌ర్స్‌లో అయినా క‌న‌ప‌డ‌తారేమో అని ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: