ఎఫ్ 3లో నటించే ఆ మూడో హీరో ఎవరు.. ఎఫ్ 2లో నటించిన వెంకటేశ్, వరుణ్ తేజ్ తోనే సీక్వెల్ ప్లాన్ చేశాడు అనిల్ రావిపూడి. ఎఫ్ 3లో మూడో హీరో కూడా ఉంటాడని ఎఫ్ 2 రిలీజైన వెంటనే ప్రకటించాడు దర్శకుడు. ఆ మూడో ప్తార ఇద్దరు హీరోల చుట్టూ తిరుగుతుందట. 

 

సరిలేరు నీకెవ్వరు తర్వాత అనిల్ రావిపూడి తన తర్వాతి మూవీ ఎనౌన్స్ చేయకపోయినా.. ఎఫ్ 2 సీక్వెల్ గా ఎఫ్ 3 తీస్తాడన్న వార్త జోరుగా నడుస్తోంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ తోనే సీక్వెల్ ఉంటుందని గతంలో ఎనౌన్స్ చేశాడు దర్శకుడు. అయితే మూడో హీరో ఎవరన్న క్వశ్చన్ మార్క్ చాలా పుకార్లు తీసుకొస్తోంది. 

 

ఎప్ 2తర్వాత అనిల్ మహేశ్ తో సరిలేరు నీకెవ్వరు తీసి హిట్ కొట్టాడు. అనిల్ తో మరో సినిమా చేస్తానని మహేశ్ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. ఈ క్రమంలో ఎఫ్ 3తో ఫుల్ లెంగ్త్ రోల్ కాదనీ.. రెండున్నర గంటల సినిమాలో 40నిమిషాలు మాత్రమే కనిపిస్తాడని సమాచారం. 30రోజుల పాటు డేట్స్ ఇస్తే చాలనీ.. దీనికి మహేశ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని తెలిసింది. 

 

ఎఫ్ 3లో మూడో హీరోగా రవితేజ, మహేశ్ పేర్లు వినిపిస్తున్నాయి. రాజా ది గ్రేట్ తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోందన్న న్యూస్ వచ్చినా.. ఎఫ్ 3కి హైప్ రావాలంటే 100కోట్ల బిజినెస్ దాటాలంటే.. మహేశ్ ఉంటేనే సాధ్యమని దర్శకుడు భావిస్తున్నాడట. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో వెంకటేశ్, మహేశ్ ది హిట్ కాంబినేషన్ కావడంతో సెంటిమెంట్ గా కూడా ఆలోచిస్తున్నాడట దర్శకుడు. అనిల్ రావిపూడి తెరకెక్కించి ఎఫ్ 2 మంచి సక్సెస్ సాధించడంతో.. ఎఫ్ 3పై ఇపుడు అంతా ఆసక్తి నెలకొంది. ఈ సీక్వెల్ లో నటించే వారు ఎవరా అనే ఉత్కంఠ సగటు ప్రేక్షకుడిలో ఉంది. అనిల్ రావిపూడిమాయ చేస్తాడోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: