చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకోక‌పోవ‌డ‌మంటే ఇదేనేమో అనిపిస్త‌ది కొంత‌మందిని చూస్తే ఇదే టైప్‌లో చాలా మంది హీరోయిన్లు త‌మ జీవితాల్ని నాశ‌నం చేసుకున్న‌వారు ఎంద‌రో ఉంటారు. ఆడ‌జ‌న్మ‌కి నిజ‌మైన అర్ధాన్నిచ్చేది అమ్మ‌త‌నం. అదిలేకుంటే జీవించ‌డం చాలా బాధాక‌రం. తెలిసిచేసినా తెలియ‌క చేసినా త‌ప్పుత‌ప్పే అవుత‌ది. ప్ర‌స్తుత జీవితం గురించి ఆలోచించి భ‌విష్య‌త్తును పోగొట్టుకున్న హీరోయిన్ల గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. ఈ విష‌యంలో ముందుగా చెప్పుకోవ‌ల‌సింది రేవ‌తే. ఈమె చాలా అద్భుత‌మైన న‌టి ఇంట‌ర్మీడియ‌ట్ నుంచే సినిమా రంగంలో అడుగుపెట్టింది ఈ న‌టి. తెలుగు, త‌మిళ ఎన్నో చిత్రాల్లో న‌టించి ఎన్నో అవార్డుల‌ను కూడా సంపాదించారు. కెరియ‌ర్ మంచి పీక్‌లో ఉన్న‌ప్పుడు సినిమాటోగ్రాఫ‌ర్ సురేష్‌చంద్ర‌మీన‌న్‌ని వివాహం చేసుకుంది. కానీ వీళ్ళ‌కు పిల్ల‌లు మాత్రం లేరు. దీనికి కార‌ణం రేవ‌తి సినిమాల్లో న‌టించ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని అంటున్నారు. పిల్ల‌ల గురించి మాత్రం ఆలోచ‌న అనేది రానివ్వ‌లేదు రేవ‌తి. పిల్ల‌ల‌ను కంటే అందం దెబ్బ‌తింటుంద‌ని త‌ర్వాత ఆఫ‌ర్స్ రావ‌నుకుని రేవ‌తి పిల్ల‌ల‌ను క‌న‌లేదు అని అంటారు. సినిమాల కంటే రియ‌ల్ లైప్ ఇంపార్టెంట్ అని తెలుసుకునే స‌మయానికి దేవుడు పిల్ల‌లు క‌ల‌గ‌కుండా చేశాడు. ఇటు చూస్తే భ‌ర్త‌తో విడాకులు. ఓ ప‌క్క సినిమాలు కూడా త‌గ్గిపోయాయి. ఈ మ‌ధ్యనే ఆమె ఒక పాప‌ని ద‌త్త‌తు తీసుకుని జీవితాన్ని గాఢిలో పెట్టుకుంది. 

 

లేడీ అమితాబ్‌గా టాలీవుడ్‌లో ఏలిన హీరోయిన్ విజ‌య‌శాంతి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది. హీరోయిన్‌గా ఎన్నోగ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టించింది. లేడీఓరియంటెడ్ చిత్రాల్లో కూడా న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించింది. టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా నిలిచింది. విజ‌య్‌శాంతి శ్రీ‌నివాస్ ప్ర‌సాద్‌ను పెళ్ళి చేసుకుని అత‌న్ని పూర్తిగా ప‌రిశ్ర‌మ‌కు దూరంగా ఉంచింది. హీరోయిన్‌గా కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే పెళ్ళి చేసుకుంది. అయితే ఈమెకు కూడా పిల్ల‌లు మాత్రం పుట్ట‌లేదు. రాజ‌కీయాల్లోకి వెళ్ళాక త‌న‌కు స‌మాజ‌మే పిల్ల‌ల‌ని. సొసైటి కోస‌మే పిల్ల‌ల‌ను క‌న‌లేదంది. 

 

ఇక న‌టి శార‌ద ఈమె కూడా చిన్న‌త‌నంలోనే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టింది. స్వ‌త‌హాగా మంచి డ్యాన్స‌ర్ అంత‌కు మించి మంచి అందం ఉండ‌డంతో సినిమాల్లోకి తీసుకున్నారు. శార‌ద దాదాపు అన్ని భాష‌ల్లో న‌టించి మంచి పేరు సంపాదించుకుంది. చ‌లం అనే న‌టుడ్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. చ‌లానికి అప్ప‌టికే పెళ్ళై పిల్ల‌లు ఉన్నారు. కానీ అత‌ని భార్య చ‌నిపోవ‌డంతో శార‌ద‌ను రెండో వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్ద‌రి కూడా పిల్ల‌లు లేరు. ప్ర‌స్తుతం చ‌లంతో విడిపోయి ఒంట‌రిగా గ‌డుపుతోంది.

 

జ‌య‌ప్ర‌ద హీరోయిన్‌గా యావ‌ద్దేశంలో జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. అందాల రాశిగా ప్రేక్ష‌కుల నీరాజ‌నాలు అందుకుంది. అతి చిన్న వ‌య‌సులోనే స్టార్ స్టేట‌స్‌ని చూసింది. అన్నీ ఉన్నాయి కానీ నోరారా అమ్మ అని పిలిచే పిల్ల‌లు త‌ప్ప‌. ప్రొడ్యూస‌ర్ శ్రీ‌కాంత్ మెహ‌తాను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అయితే అప్ప‌టికే ఆయ‌న‌కి పెళ్ళై పిల్ల‌లు ఉన్నారు. ఆయ‌న‌తో కూడా ఎక్కువ‌కాలం క‌లిసుండ‌క పోవ‌డంతో పిల్ల‌లు కూడా క‌ల‌గ‌లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: