హీరోయిన్ గానే కాకుండా లేడీ ఒరియే౦టెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి విజయశాంతి. కొన్నాళ్ళ పాటు తెలుగు సినిమాను రాములమ్మ శాసించారు అనేది వాస్తవం. ఒస్సేయ్ రాములమ్మ, కర్తవ్యం వంటి సినిమాలతో తన పూర్తి స్థాయి నటనతో అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నారు. అయితే ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెరాస పార్టీ నుంచి ఎంపీగా విజయం సాధించడమే కాకుండా కెసిఆర్ కి అత్యంత సన్నిహిత నేతగా గుర్తింపు పొందారు.



పార్లమెంట్ లో తెలంగాణా అంశాన్ని లేవనెత్తిన తొలి మహిళా ఎంపీగా ఆమె మన్నలను అందుకున్నారు. అయితే ఆ తర్వాత కెసిఆర్ తో విభేదించి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ సమయంలో మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో నటించారు విజయశాంతి. ఈ సినిమాతో ఆమె నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. సెకండ్ ఇన్నింగ్స్ ని విజయవంతంగా మొదలుపెట్టారు అంటూ భావించిన తరుణంలో సినిమాలకు దూరమయ్యే విధంగా వ్యాఖ్యలు చేసారు ఆమె.


ఇటీవల ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ తర్వాత ఎన్నో చర్చలు జరిగాయి. అయితే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పడానికి ప్రధాన కారణం టాలివుడ్ ఆమెను వద్దనడమే అంటున్నారు. ఆమెకు భారీగా పారితోషకం ఇవ్వాలి అని నిర్మాతలు భయపడుతున్నారట. అదే విధంగా ఆమెతో సినిమా చెయ్యాలి అంటే కచ్చితంగా స్టార్ హీరో అయ్యే ఉండాలని, చిన్న హీరోల పక్కన ఆమె మ్యాచ్ అవ్వరని, కాబట్టి అందరు హీరోలతో ఆమె సినిమా చేయడం కష్టమని భావిస్తున్నారట నిర్మాతలు మహేష్ తో సినిమా కోసం సైడ్ క్యారెక్టర్ కే ఆమె భారీగా వసూలు చేసారని, కాబట్టి ప్రస్తుతం రాములమ్మను భరించడం మా వల్ల కాదని నిర్మాతలు భయపడుతున్నారట. మరి భవిష్యత్ లో రాములమ్మ సినిమాలు వస్తాయా రావా అన్న విషయం పై చర్చలు నడుస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: