ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చే విధంగా కీలక అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం పరిపాలన గాడిలో పెట్టే పనిలో ఉన్న జగన్ 90 శాతం ఆ పని పూర్తి చేసారు. ఇక ఆదాయ వనరుల మీద దృష్టి పెడుతున్న సిఎం, ఇప్పుడు రాష్ట్రంలో పలు కంపెనీలను ఆహ్వానించే యోచనలో ఉన్నారని అంటున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో కంపెనీలు మొదలుపెట్టే వారి కోసం జగన్ ఇప్పటికే ఒక ప్లాన్ తో ఉన్నారని, వారికి అన్ని విధాలుగా ప్రభుత్వ సహకారం ఉంటుందని అంటున్నారు. ఏపి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి సినీ ఇండస్ట్రీపై కూడా బాగానే దృష్టి పెడుతున్నట్టు సమాచారం. 



చంద్రబాబు హయాంలో సినీ పరిశ్రమ ఏపీకి పెద్దగా రాలేదు. టీడీపీకి దగ్గరగా ఉండే మహేష్ బాబు వంటి హీరోలు భూములు కొనుక్కున్నారు గాని ఆంధ్రప్రదేశ్ రావడానికి ఇష్టపడలేదు. ఈ నేపధ్యంలో జగన్ వారి కోసం కీలక నిర్ణయం తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. త్వరలో సిని పరిశ్రమకు రాయితీలు ఇవ్వాలని భావిస్తున్నారు. గోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్రలోని అరకు సహా పలు ప్రాంతాల్లో షూటింగ్ కి మంచి స్పాట్ లు ఉన్నాయి. ఏపీలో షూటింగ్ చేస్తే మాత్రం వారికి రాయితీలు ఇవ్వాలని భావిస్తున్నారట.


చంద్రబాబు ఉన్నప్పుడు చిన్న సినిమాలకు మాత్రం రాయితీలు ఇచ్చారు. ఇప్పుడు జగన్ భారీ బడ్జెట్ సినిమాలకు కూడా రాయితీలు ఇవ్వాలని భావిస్తున్నారు. తద్వారా ఏపీలో చిత్ర పరిశ్రమకు మంచి మార్గం సుగుమం చెయ్యాలని భావిస్తున్నారాయన. త్వరలోనే దీనికి సంబంధించి ఒక కేబినేట్ సమావేశం కూడా జరిగే అవకాశం ఉందని, ఆ తర్వాత జగన్ నిర్మాతలతో సమావేశం నిర్వహించి ఈ ప్రకటనను అధికారికంగా బయటపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే పలువురు నిర్మాతలు జగన్ ని సంప్రదించినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: