జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా అనగానే దర్శకులు కాస్త ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. క్లాస్, మాస్ లో ఫాలోయింగ్ ఉన్న అరుదైన హీరో కాబట్టి ఆయన కోసం కథలు రాసుకుని వాటికి తుది మెరుగులు దిద్దిన తర్వాతే షూటింగ్ మొదలుపెడతారు. చిన్న తేడా వచ్చినా సరే సినిమా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఎక్కడా ఛాన్స్ తీసుకునే పరిస్థితి దాదాపుగా ఉండదు అనేది వాస్తవం. అందుకే జూనియర్ ఈ మధ్య ఎక్కువగా హిట్లు కొడుతున్నారు. గత దశాబ్దంలో తారక్ ఫ్లాప్ అయిన సినిమాలు తక్కువ.



ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి చేస్తున్నాడు తారక్. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఈ సినిమా కోసం తారక్ కూడా ఎక్కువగానే కష్టపడుతున్నాడు. అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి త్రివిక్రమ్ కాస్త హ్యాపీ గా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. తారక్ తో చేసే సినిమాకు కథను పూర్తిగా సిద్దం చేసుకోవచ్చని భావిస్తూ త్రివిక్రమ్, ఆ పనిలో పడిపోయాడు. ఈ సమయంలోనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది అంటున్నాయి టాలివుడ్ వర్గాలు.



అది ఏంటీ అంటే, జూనియర్ ఎన్టీఆర్ కి కాస్త రాజకీయ మైలేజ్ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఆయనతో రాజకీయ నేపద్యం ఉన్న కథ తీస్తే ఇబ్బంది ఉండదని భావిస్తున్నారట. ఆ సినిమా అయితే అన్ని వర్గాల ప్రేక్షకులు చూస్తారని, అరవింద సమేత మాదిరి క్లాస్, మాస్ ని ఆకట్టుకోవచ్చని భావిస్తూ, ఆ విధంగా రాజకీయ నేపధ్యం ఉన్న కథనే సిద్దం చేస్తున్నాడు త్రివిక్రమ్. ఇప్పటికే బోయపాటి సలహాలను కూడా తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాలో జూనియర్ మంత్రి పాత్రలో కనపడే అవకాశం ఉందని అంటున్నారు. ఒక పవర్ ఫుల్ మంత్రిగా ఆయన నటిస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: