ప్రముఖ దర్శకుడు రాజమౌళి స్థాయి బాహుబలి సినిమా తర్వాత అమాంతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో ఆయన ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి వెళ్లిపోయింది. బాహుబలి రెండు భాగాలు కూడా హాలీవుడ్ లో కూడా సత్తా చాటిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా భారీ వసూళ్లు సాధించాయి. ప్రధానంగా బాహుబలి 2 అయితే హాలీవుడ్ సినిమాలను కూడా ఆశ్చర్యపరిచే స్థాయిలో వసూళ్లు సాధించి మైండ్ బ్లాక్ చేసింది. ఇక అప్పటి నుంచి రాజమౌళి పేరు మరింతగా మారుమోగుతుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం.

 

ఇక ఇప్పుడు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్  అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. మూడు సార్లు విడుదల తేదీలను చిత్ర యూనిట్ ప్రకటించినా అవి వాయిదా పడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం జూలై లో అనుకుని ఆ తర్వాత దసరాకు మార్చారు. ఇప్పుడు మళ్ళీ మరో మూడు నెలలు పొడిగించి జనవరికి తీసుకువెళ్ళింది చిత్ర యూనిట్. దీనితో ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు షాక్ అయ్యారు.

 

ఇదిలా ఉంటే ఇప్పుడు రాజమౌళి... గురించి హాలీవుడ్ నిర్మాతలు కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఆయనతో ఒక వెబ్ సీరీస్ చెయ్యాలని, అందుకు తగిన కథ కోసం ఆయనను, రాజమౌళి తండ్రి రాజేంద్ర ప్రసాద్ ని అడిగినట్టు సమాచారం. ఈ సినిమా అవ్వగానే ఆయనతో డేట్స్ కూడా అడిగినట్టు తెలుస్తుంది. హాలివుడ్ లో సినిమా కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ఆర్.ఆర్.ఆర్ సినిమా పూర్తి అయిన వెంటనే హాలివుడ్ సినిమాను మొదలుపెట్టించాలని భావిస్తున్నారట అక్కడి ఒక ప్రముఖ నిర్మాత. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: