యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఎప్పుడెప్పుడా ఈ టాల్ హీరో పెళ్ళి అని డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. బాహుబలి తర్వాత వచ్చిన అసాధారణ క్రేజ్ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు ప్రభాస్ సినిమాలు ప్రపంచమంతా చూస్తున్నారు. అలాగే ఆయన పెళ్ళి విషయం కూడా ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా తన కో స్టార్ స్వీటి అనుష్క శెట్టి తో ప్రభాస్ డీప్ లవ్ లో ఉన్నాడని గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలలో ఈ ఇద్దరు కలిసి నటించడం వల్ల ప్రభాస్, అనుష్క మధ్య బాగా క్లోజ్ నెస్ పెరిగి ఇద్దరు ప్రేమలో పడ్డారని గత కొంత కాలంగా ఆ ప్రేమని కొనసాగిస్తూ మునిగి తేలుతున్నారని మీడియాలలో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. 

 

అందుకు తగ్గట్టు వీళ్ళు కూడా చాలా పబ్లిక్ ఫంక్షన్స్ కి కలిసి రావడం అనుమానాలకి తావిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో సినిమాలకంటే హాట్ టాపిక్ ప్రభాస్-అనుష్క ల పెళ్ళే. అయితే వీళ్ళు కూడా గట్టిగా కాదని చెప్పలేకపోతున్నారు. ఎప్పుడు ఎవరిని అడిగినా పొడి దగ్గులా సమాధానమిచ్చి నవ్వేసి ఊరుకుంటున్నారు తప్ప గట్టిగా ఖండించింది లేదు. అయితే ఈ మధ్య మళ్ళీ ఈ టాపిక్ హాట్ హాట్ గా తయారవుతోంది. ప్రభాస్ కి ఒక పెద్ద వ్యాపార వేత్త కూతురితో పెళ్ళి జరగబోతోందని. వాళ్ళు ఫారిన్ లో స్థిరపడ్డ తెలుగు వాళ్ళని ఇంకా చెప్పాలంటే రాజులని చెప్పుకొచ్చారు. మరి ఏమైందో అంతా సైలెంట్ గా ఉన్నారు. మరో వైపు అనుష్క ఒక క్రికెటర్ తో పెళ్ళికి రెడీ అవుతుందంటూ వార్తలు వచ్చాయి. ఇది తెలిసిన అనుష్క  ..చేయండి ఎన్నిసార్లు నాకు పెళ్ళి చేస్తారో చేయండి అంటూ కామెంట్ చేసి ఊరుకుంది. 

 

ఇక ఇదే ప్రస్తావన రీసెంట్‌గా ప్రభాస్ దగ్గర వచ్చిందట. అనుష్క క్రికెటర్ ని పెళ్ళి చేసుకుంటుందట కదా అని అడగ్గా పాపం ప్రభాస్ అవునా నాకు తెలీదే అంటూ అమాయకంగా సమాధానమిచ్చాడట. అంతేకాదు మరి మీరు అనుష్క పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు. అందరు అదే ఫిక్సై ఉన్నారు ..ఇందులో నిజమెంత ఉంది అని అడగ్గా అలాంటిదేమీ లేదని అన్నాడట. ఎందుకు అనుష్క మీకి సెట్ అవదా అంటే ...ఎస్ అనుష్క కి నాకు పెళ్ళి సెట్ అవదు. మాకు అసలు ఆ ఆలోచన కూడా లేదు. మేము మంచి ఫ్రెండ్స్ అంతే. కలిసి మూడు సినిమాలు చేశాము గనక భాగా క్లోజ్ గా ఉంటాము అంతే. ప్రస్తుతానికి మాకు అలాంటి ఆలోచనలే లేవు. మీరే పదే పదే మా పెళ్ళి గురించి నానా రచ్చ చేస్తున్నారని అన్నారట. మరి ఇదేదో ఇంతకముందే నోరు విప్పి గట్టిగా మాట్లాడితే అందరి నోఋలు మూత పడేవి కదా డార్లింగ్. పాపం అనుష్క బ్లేం అవుతోంది ప్రతీ సారి. 

మరింత సమాచారం తెలుసుకోండి: