టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తొలిసారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కలిసి తెరకెక్కుతున్న గ్రాండ్ హిస్టారికల్ మూవీ ఆర్ఆర్ఆర్. తొలుత ఈ సినిమాని ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేస్తామని ప్రకటించిన యూనిట్, సినిమాలో క్వాలిటీ అలానే సీజీ వర్క్ మరింత పెండింగ్ ఉండడంతో సినిమాను మరికొద్ది రోజులు వాయిదా వేసి 2021 జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా ఏకంగా పది భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తామని ఇటీవల ఒక అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ని రిలీజ్ ఇవ్వడం జరిగింది. 

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీని అందిస్తుండగా, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సమకూరుస్తున్నాడు. ఇక పోతే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ఇటీవల పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అయింది. అదేమిటంటే, ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర యొక్క నిడివి ఎక్కువ అని, అలానే రామ్ చరణ్ పాత్ర యొక్క నిడివి తక్కువ అని, 

 

అయితే కావాలనే రాజమౌళి ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రని పెంచారని పలు రూమర్స్ ప్రచారం అయ్యాయి. ఇక దీనిపై నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, సినిమాలోని కథ కథనాలను బట్టి అల్లూరి, కొమరం భీమ్ క్యారెక్టర్లు కొనసాగుతాయని, అలానే ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు ఎంతో భారీగా చిత్రీకరిస్తున్న ఈ సినిమాలో హీరోలు ఇద్దరి క్యారెక్టర్లు ఎంతో బలంగా ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. దీనితో ఒక్కసారిగా పుకారవుతున్న వార్తలకు పూర్తిగా అడ్డుకట్ట పడ్డట్లయింది. మరి ఈ సినిమా ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది సంక్రాంతి సమయం వరకు వేచి చూడాల్సిందే... !!

మరింత సమాచారం తెలుసుకోండి: