టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదట యావరేజ్ టాక్ సంపాదించినప్పటికీ, సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా రోజుల తర్వాత అదరగొట్టే ఎంటర్టైనింగ్ పెర్ఫార్మన్స్ కనపరచడంతో పాటు, సంక్రాంతి సెలవులు కావడంతో సినిమాకు అద్భుతంగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక అతి త్వరలో మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గత ఏడాది బోయపాటి దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చినప్పటికీ, 

 

అంచనాలు అందుకోలేక అది ఫ్లాప్ అయ్యింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మరొక స్టార్ హీరో ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ ప్రతిష్టాత్మక సినిమాలో నటిస్తున్నారు చరణ్. ఇకపోతే వీరిద్దరికీ సంబంధించి ఒక వార్త కొద్దిరోజులుగా పలు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. అదేమిటంటే మెగాస్టార్ 152 రెండవ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారని, ఆ పాత్ర చిన్నదే అయినప్పటికీ సినిమాలో ఎంతో కీలకమని సమాచారం. 

 

అలానే అతి త్వరలో అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న ఎఫ్2 సినిమా సీక్వెల్ అయిన ఎఫ్3 లో మహేష్ బాబు ఒక స్పెషల్ రోల్ చేయనున్నారని, సినిమాలోని సెకండ్ హాఫ్ లో ఒక ఇరవై నిమిషాల పాటు వచ్చే మహేష్ బాబు క్యారెక్టర్ సినిమా మొత్తానికి పెద్ద హైలెట్ అని అంటున్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించి విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు గాని, ఒకవేళ నిజమైతే మాత్రం అటు మెగా స్టార్ ఫ్యాన్స్ కి ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది పెద్ద పండుగ వార్త అని చెప్పాలి. ఇక ఈ విధంగా వీరిద్దరూ ఆయా సినిమాల్లో సర్ప్రైజింగ్ రోల్స్ లో నటిస్తే మాత్రం అది ఆ సినిమాలకు మరింత ప్లస్ అవుతుంది అనే చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: