తెలుగు తెర పై చెర‌గ‌ని ముద్ర వేసిన హీరోయిన్ మ‌హాన‌టి సావిత్రి.  మహానటి సావిత్రి చలనచిత్ర జీవితాన్ని మలుపుతిప్పిన మహాచిత్రం దేవదాసు. ఈ చిత్రంలో పార్వతిగా సావిత్రి గారి నటన నభూతో నభవిష్యత్‌దేవదాసు చిత్రం ఎన్నో అవార్డులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలనూ అందుకొని కలెక్షన్ల వర్షం కురుపించింది. తరువాత కూడా ఈ చిత్రం ఎన్నో సార్లు విడుదలై కనకవర్షం కురిపించింది. స్వర్ణోత్సవాలు  జరుపుకున్న పెద్ద హిట్ చిత్రమిది. న‌ట‌న ప‌రంగా సావిత్రి ఎన్ని ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిగ‌మించిందో వ్య‌క్తిగ‌త జీవితంలో అన్ని క‌ష్టాలు అనుభ‌వించింద‌ని చెబుతూ ఉంటారు.  జెమిని గ‌ణేష‌ణ్‌ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు సావిత్రి. ఇద్ద‌రు కొన్నాళ్ళ‌పాటు ఎంతో అనోన్యంగా ఉండేవారు. ఒక‌రోజు అనుకోకుండా జెమినిని మ‌రో అమ్మాయితో చూసిన సావిత్రి అప్ప‌టి నుంచి ఆయ‌న పై ద్వాషం పెంచుకుంది. 

 

ఆ రోజు నుంచి జెమిని ని ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌లేదు. దాంతో వారిద్ద‌రి మ‌ధ్య వివాదాలు మొద‌ల‌య్యాయి. సావిత్రికి చాలా మొండిప‌ట్టుద‌ల ఎక్కువ అంటారు. అత‌ని పై ఉన్న ప్రేమ‌తో చివ‌రి రోజుల్లో మ‌ద్యానికి బానిసై అత‌ని పై ఉన్న ప్రేమ‌ను చంపుకోలేక త‌న జీవితాన్ని ముగించుకుంది. డాక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి సినిమాలో న‌టించేందుకు న‌గ‌రానికి విచ్చేసిన సావిత్రిని బ‌ర్క‌త్‌పురాలోని ఆంధ్ర యువ‌తి మండ‌లి సంస్థ ఏనుగు అంబాని పై ఊరేగించారు. జెమిని గ‌ణేష‌ణ్‌ని విప‌రీతంగా ప్రేమించ‌డం వ‌ల్లే సావిత్ర‌మ్మ‌కు ఈ క‌ష్టాల‌ని చెప్పుకుంటారు. త‌న‌కు విధించిన శిక్ష సావిత్రి చివ‌రి ద‌శ‌లో అలా బ్ర‌తికింది అని అంద‌రూ చెప్పుకుంటారు. రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖ‌ల మ‌ధ్య సావిత్రికి ర‌వీంద్ర‌భార‌తిలో న‌ట‌శిరోమ‌ణి బిరుదును ప్ర‌దానం చేశారు.

 

సావిత్రి కేవ‌లం అభినేత్రి మాత్ర‌మే కాదు అంత‌క‌న్నా మంచి మ‌న‌సున్న మ‌నిషికూడా. అంతేకాక దేశం పైన కూడా సావిత్రికి అపార‌మైన గౌర‌వ మ‌ర్యాద‌లు కూడా ఉన్నాయి. ఇక జెమిని గ‌ణేష‌న్ కి సావిత్రిని పెళ్ళి చేసుకునేట‌ప్ప‌టికే పెళ్ళై ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. అయినా సావిత్రిని వివాహ‌మాడారు. చివ‌రికి జెమిని గ‌ణేష‌ణ్ కి న‌లుగురు భార్య‌లు అందులో పుష్ప‌వ‌ల్లి ఒక భార్య. పుష్ప‌వ‌ల్లి కూతురే రేఖ‌. అద్భుత‌మైన న‌టి. మ‌ధ్యానికి బానిసైన త‌ర్వాత ఆమె ఆ ఒత్తితో 19నెల‌ల వ‌ర‌కు కోమాలోకి వెళ్ళిపోయారు. భ‌ర్త‌తో విడిపోయాక సావిత్రికి ఆ బాధ గుండెలో బండ‌రాయిలా మిగిలిపోయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: