టాలీవుడ్‌ ప్రస్తుతం ఫుల్‌ ఫాంలో ఉన్న మ్యూజిక్‌ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ తమన్‌. సమ్మర్‌ బరిలో రిలీజ్‌ అయిన అల వైకుంఠపురములో సినిమా తమన్‌ రేంజ్‌ను తారా స్థాయికి చేర్చింది. ముఖ్యంగా ఈ సినిమాలోని సామజవరగమన, రాములో రాములా పాటలకు యూట్యూబ్‌లో 100 మిలియన్లకు పైగా వ్యూస్‌ రావటంతో పాటు ఇప్పటికే ఈ పాటలు చాట్‌ బస్టర్స్‌గా నిలిచాయి. అంతేకాదు సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ కూడా సూపర్‌ హిట్ అయ్యింది.

 

ఇన్నాళ్లు తమన్‌ అంటే కాపీ మ్యూజిక్‌ డైరెక్టర్ అన్న అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఇమేజ్‌ను చెరిపేసుకున్న తమన్‌, టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా సత్తా చాటుతున్నాడు. స్టార్ హీరోలందరూ తమన్‌తో మ్యూజిక్‌ చేయించుకునేందుకు ఎదురుచూస్తున్నారు. అయితే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కొనసాగుతూనే మరో వ్యాపారం కూడా చేస్తున్నాడు తమన్‌. తాను స్వయంగా సినిమాలకు సంగీతం అందించటం తో పాటు ఇతర సంగీత దర్శకులు పని చేస్తున్న సినిమాలకు నేపథ్య సంగీతాన్ని కూడా అందిస్తున్నాడు.

 

గతంలో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అంటే అంతా మణిశర్మ దగ్గరకు పరుగులు పెట్టేవారు. హీరోయిజంతో పాటు సీన్‌లోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేసే బీజీయం ఇవ్వటంలో మణిశర్మ స్సెషలిస్ట్. అయితే మణిశర్మ సినిమాలకు దూరంగా ఉన్న ఆ సమయంలో ఆ స్థానాన్ని తమన్‌ భర్తీ చేశాడు. తాను సంగీత దర్శకుడు స్టార్‌ ఇమేజ్‌ అందుకోకముందే నేపథ్య సంగీతంలో తన మార్క్‌ చూపించాడు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాకు ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇస్తున్నాడు తమన్‌.

 

నేచురల్‌ స్టార్‌ నాని విలన్‌గా నటిస్తున్న తొలి చిత్రం వీ. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్‌ బాబు హీరో. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమాకు అమిత్‌ త్రివేది సంగీతమందిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు తమన్‌ తో నేపథ్యం సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం తమన్‌ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: