టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో ప్రేమ కథ సినిమాలు వచ్చాయి. అయితే గుండెలకు హత్తుకునే లవ్ స్టోరీస్ చాలా తక్కువగా ఉన్న చాలా వరకు ఈ తరహా సినిమాలకు మంచి ఆదరణే లభిస్తుంది.  తాజాగా తమిళనాట సంచలన విజయం అందుకున్న 96 మూవీకి రిమేక్ గా తెలుగులో..  సమంత, శర్వానంద్ జంటగా ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన సినిమా జాను. తమిళనాట ఈ పాత్రల్లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు.  ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 22 కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ సినిమా మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ఈ సినిమా మూడు రోజులకు 6.52 కోట్లు మాత్రమే వసూల్ చేయగలిగింది.

 

అయితే దిల్ రాజ్ బ్యానర్ కావడంతో కలెక్షన్లు బాగానే వస్తాయని భావించారు అందరూ.. కానీ జాను మాత్రం నత్తనడకన సాగుతుంది.  ఈ సినిమా సేఫ్ జోన్ లోకి రావాలంటే ఇంకా 15.48 కోట్లు వసూలు చేయాలి. కానీ అలా అయ్యే అవకాశాలు లేవంటున్నారు. తమిళనాట చరిత్ర సృష్టించిన 96 సినిమాకు రీమేక్ ఇది. అక్కడ క్లాసిక్ అనడంతో ఇక్కడ కూడా సూపర్ హిట్ అవుతుందని అంతా అంచనా వేసారు కానీ ఇప్పుడు కలెక్షన్లు చూస్తుంటే దిమ్మతిరిగిపోతోంది. ఈ మూవీ ఓపెనింగ్స్ కూడా నిరాశజనకంగానే ఉన్నాయి.

 

సినిమా స్లో నేరేషన్ సినిమాకి మెయిన్ మైనస్ అయినప్పటికీ.. అవే కలెక్షన్స్ ని శాసించే స్థాయికి కారణం అవ్వడం మాత్రం విడ్డూరమే. కాకపోతే దిల్ రాజు కూడా తనవంతు ప్రమోషన్ సినిమాపై మొదటి నుండి గట్టిగా చేసినట్టయితే.. జానూ కలెక్షన్స్ కళకళలాడేవి అంటున్నారు.   ప్రపంచవ్యాప్తంగా జాను 20 కోట్ల మార్క్ ను టచ్ చేయాలి. అప్పుడే సినిమాను హిట్ గా చెప్పుకోగలం.. అయితే జాను ఆ మార్క్ దాటే వరకు కష్టాలే అంటున్నారు సినీ విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: