సుమంత్, కీర్తిరెడ్డిలు ప్రేమించి పెళ్ళి చేసుకున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అది ఇది కేవ‌లం మూడునాళ్ళ ముచ్చ‌టే అయింది. వీరిద్ద‌రూ కూడా ఎక్కువ కాలంపాటు క‌లిసిలేరు. అందుకు కార‌ణాలేంటో ఒక సారి చూద్దాం. ఎంతో ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకున్న తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డితో లైఫ్‌ని చివ‌రి వ‌ర‌కు లీడ్ చేయ‌లేక‌పోయారు. కార‌ణాలు ఏమైన ప్ర‌స్తుతం సుమంత్ మాత్రం ఒంట‌రి జీవితాన్ని గ‌డుపుతున్నాడు. అయితే పూర్తిగా విడిపోయిన‌ప్ప‌టికీ సుమంత్‌కి త‌న మాజీ భార్య పైన ప్రేమ త‌గ్గ‌లేదా అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తుంది. కీర్తిరెడ్డి మాత్రం సుమంత్‌ని విడిపోయాక వేరే పెళ్ళి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది. వీరిద్ద‌రు ఏడేళ్ళు గాఢంగా ప్రేమించుకున్నాక పెళ్ళి చేసుకున్నారు. కానీ పెళ్ళి చేసుకున్నాక సంవ‌త్స‌రంలోపే విడిపోయారు. కీర్తిరెడ్డి మొద‌టి నుండి కూడా స్వ‌తంత్ర భావాలు క‌ల్ల‌ది. చిన్న‌ప్ప‌టి నుండి కూడా డ‌బ్బులో పుట్టి డ‌బ్బులో పెరిగింది. తెలంగాణా మినిస్ట‌ర్ గంగారెడ్డి మ‌న‌వ‌రాలు కీర్తిరెడ్డి. దీంతో ఏ రిస్ట్రిక్ష‌న్స్ లేవు. కానీ పెళ్ళైతే మాత్రం అలా ఉండ‌దు క‌దా ఇద్ద‌రూ ఒక‌రికి ఒక‌రు అన్నట్లు ఉంటుంది. అక్కినేని ఫ్యామిలీలో ఎక్కువ‌గా కొన్ని క‌ట్టుబాట్లు ఉండేవి. కానీ కీర్తికి అవి పెద్ద‌గా న‌చ్చేవి కావు. తాను కాళీగా ఉండ‌లేక ఏదో ఒక బిజినెస్ చేయ‌ల‌నుకుంది. 

 

దాంతో ఒక నేష‌న‌ల్ సెలూన్‌ని స్టార్ట్ చేస్తా అంటూ అంతేకాక టీవీలోకూడా కొన్ని టాక్ షోస్ చేస్తా అంటూ చిన్న చిన్న గొడ‌వ‌లు పెట్టుకునేది. ఓ పెద్ద బిజినెస్ మ్యాన్‌లాగా ప్లానులు వేసుకుంది. కీర్తిరెడ్డి వాళ్ళ నాన్న‌కూడా పెద్ద బిజినెస్ మ్యాన్ అని అంటారు. కానీ అప్ప‌టి ప‌రిస్థితుల్లో సుమంత్‌కి, అక్కినేని ఫ్యామిలీకి ఇవేమి న‌చ్చేవి కావు. దీనికి తోడు ఆమె కొంత పాష్‌గా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఆమె ప‌ద్ధ‌తులు, విధానాలు కూడా ఎవ్వ‌రికీ నచ్చ‌డం లేదు. ఎవ్వ‌రూ ఏమీ అడ‌గ‌కూడ‌దు అన్న‌ట్లు ఉండేది. ఏ బంధ‌మైన సెటిల్ అవ్వ‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంది. అన్న‌టికి ఓర్పు కావాలి. 

 

కానీ ఆ ఓర్పు అనేది వీరిద్ద‌రిలో లేక‌పోయింది. ఇక ఇదిలా ఉంటే ఓసారి సుమంత్‌ని కీర్తిరెడ్డి యాక్టింగ్ మానేసి నాతో వ‌చ్చేయ్ మా బిజినెస్‌లు చాలానే ఉన్నాయి అవి చూసుకుందాం అంది. దానికి సుమంత్ స‌సేమిరా అన్నాడు. ఎందుకంటే త‌న తాత‌ల ద‌గ్గ‌ర నుంచి కూడా న‌ట‌న పై ఆశ‌క్తి ఉన్న‌వారు స‌డెన్‌గా అలాంటి డెసిష‌న్ ఎలా తీసుకుంటాడు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య అభిప్రాయ బేధాలు వ‌చ్చాయి దాంతో విడిపోదామ‌ని నిర్ణ‌యించుకుని విడిపోయారు.  కానీ ఈ ఇరు కుటుంబాలు ఇప్ప‌టికీ మంచి ఫ్రెండ్స్ వాళ్ళ ఫంక్ష‌న్స్‌కి వీళ్ళు. వీళ్ళ ఫంక్ష‌న్స్‌కి వాళ్ళు వెళుతుంటారు. పాజిటివ్‌గానే విడిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: