విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో విజయ్ పలికిన మాటలు, అతని చేష్టలు ఎంతో పాపులర్ అయ్యాయి. సినిమా వచ్చి రెండేళ్ళు దాటిపోతున్నా ఇంకా దాని ప్రభావం ఉంది. ఏ సినిమాలో అయినా విజయ్ కొంచెం కోపంగా అరిచినా, ముద్దు సీన్లు కనిపించినా ఇది అర్జున్ రెడ్డిలా ఉందని తేల్చేస్తున్నారు.

 

 


డియర్ కామ్రేడ్ విషయంలో అదే జరిగింది. రష్మిక, విజయ్ దేవరకొండల మధ్య కెమిస్ట్రీ బాగున్నప్పటికీ అర్జున్ రెడ్డి ఛాయలున్నాయన్న కారణంగా ఆ సినిమా ఫలితం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో అలాగే జరగనుందా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ చూసిన వారందరూ అందులో విజయ్ గెటప్ చూసి, డైలాగులు చూసి ఇది అర్జున్ రెడ్డిలా ఉందని అనేస్తున్నారు.

 

 


ఈ విషయమై విజయ్ ని అడగ్గా... ఇలా స్పందించాడు. అర్జున్ రెడ్డి సినిమాతో పోలిస్తే మంచిదే..అది నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్.. అలా అని అన్ని సినిమాలని అదే కోవలో తీయాలని అనుకోవట్లేదు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నాలుగు కథలు ఉన్నాయి. వాటిల్లో ఒక పాత్ర అర్జున్ రెడ్డి లా అనిపిస్తే తప్పులేదు. మిగతా కథలన్నీ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయి. ఇంతకుముందు నేనెప్పుడూ చేయని పాత్రల్ని చేసేటపుడు చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యాను.

 

 

చూస్తున్నప్పుడు మీరు కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతారని సమాధానం ఇచ్చాడు.  విజయ్ చెప్పినట్టు మిగతా మూడు కథలు కొత్తగా ఉండి ప్రేక్షకులకి కొత్త అనుభూతిని ఇస్తాయా లేదా ఇవి కూడా అర్జున్ రెడ్డి ప్రభావం వల్ల ప్రేక్షకులకి విసుగు కలిగిస్తాయా అన్నది చూడాలి. ఈ సినిమా ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: