టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాతక్మకంగా తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో ఎస్ ఎస్ రాజమౌళి ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.  ఆయన తదుపరి సినిమాలు పాన్ ఇండియా మూవీ నేపథ్యంలో రూపొందుతున్న విషయం తెలిసిందే.  అయితే రాజమౌళి మొదటి నుంచి ఎంచుకునే ప్రతి కథలో ఏదో ఒక వైవిద్యం ఉండేలా చూసుకుంటున్న విషయం తెలిసిందే. కమర్షియల్ హిట్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఆయన సినిమాల్లో ఉంటుంది.  టాలీవుడ్ ని ఏకంగా జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని  నిలబెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది.  ఒకప్పుడు కలెక్షన్ల రికార్డులు అంటే బాలీవుడ్, కోలీవుడ్ కి మాత్రమే పరిమితం అయ్యేవి.. కానీ బాహుబలి సీరీస్ తర్వాత ఆ రికార్డులు బ్రేక్ అయ్యాయి. బాహుబలి 2 సినిమా తర్వాత రాజమౌళి ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని ‘ఆర్ ఆర్ ఆర్’ అనే మూవీ తెరకెక్కిస్తున్నారు. 

 

ఈ మూవీలో టాప్ తెలుగు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా 70 శాతానికి పైగా చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా నుంచి రానున్న ఎన్టీఆర్ .. చరణ్ ఫస్టులుక్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చరణ్ ఫస్టులుక్ ముందుగా పలకరించనుందనే టాక్ ఒకటి ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. గతంలో ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారని టాక్ వినిపించినా.. అది వర్క్ ఔట్ కాలేదు. అంతే కాదు ఇటీవల ఈ మూవీకి సంబంధించిన లీకేజ్ ల ప్రాబ్లమ్ కూడా ఎక్కువే అయ్యింది. 

 

అయితే రాజమౌళి ఏది చేసినా ఒక సిస్టమ్ ఫాలో అవుతుంటారన్న విషయం తెలిసిందే.  గతంలో బాహుబలి బలి ఫస్ట్ లుక్స్ నటుల పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు.  ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చరణ్ పుట్టిన రోజు మార్చి 27వ తేదీన. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, చరణ్ ఫస్టులుక్ ను రాజమౌళి రిలీజ్ చేయనున్నట్టు చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20వ తేదీన .. ఆ రోజున ఆయన ఫస్టులుక్ ను విడుదల చేయనున్నట్లు టాలీవుడ్ లో చర్చలు నడుస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: