విజయ్ దేవరకొండ జాహ్నవి పై ఆశలు పెట్టుకుని ఆమె కోసం తన ఫిలిం షూటింగ్ ను బాంబేకి మార్చుకున్నా చివరి నిముషంలో ఆమె హ్యాండ్ ఇవ్వడంతో మరో క్రేజీ హీరోయిన్ అనన్య పాండే ను విజయ్ కోసం రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ తో వెలుగులోకి వచ్చిన అనన్య పాండే పై బాలీవుడ్ యూత్ లో మంచి క్రేజ్ ఉంది. 


దీనికితోడు ఎలాంటి హాట్ సీన్స్ లో అయినా నటించడానికి ఓకె చేసే ధైర్యం ఉన్న అనన్య విజయ్ పక్కన అన్ని విధాల సరిపోతుందని ఈ మూవీకి ఛార్మీ తో పాటు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్ ఒక అభిప్రాయానికి రావడంతో ఈమె విజయ్ లేటెస్ట్ గా నటిస్తున్న బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘ఫైటర్’ కు ఫిక్స్ చేసారు. తెలుగు హిందీ భాషలలో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ మూవీ కోసం ఏకంగా పూరీ జగన్నాథ్ తన నివాసాన్ని కూడ ముంబాయికి మార్చుకున్నాడు అంటే ఈ మూవీ పై పూరీ ఎంత గట్టి పట్టుదలతో ఉన్నాడో అర్ధం అవుతుంది. 


ఇది ఇలా ఉండగా ఈ సినిమాలోని ఒక కీలకమైన సెట్ కోసం ఇప్పుడు ఈ మూవీ నిర్మాతలు 5 కోట్లు ఖర్చు పెడుతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ లాంటి హీరో రేంజ్ మూవీ బడ్జెట్ కు కేవలం ఒకే ఒక్క సెట్ కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.


మరో రెండు రోజులలో విడుదల కాబోతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ ప్రమోషన్ పూర్తి అయిన తరువాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా విజయ్ ముంబాయ్ వెళ్ళి పూరీ షూటింగ్ లో పాల్గొన బోతున్నాడు. అక్కడే పూరి తన మార్క్ స్టైల్ లో అనన్య పాండే విజయ్ లపై కొన్ని రొమాంటిక్ సీన్స్ తీయబోతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ మూవీని జూన్ లో విడుదల చేసి విజయ్ బాలీవుడ్ ఎంట్రీ చాల గ్రాండ్ గా ప్రారంభించాలి అని పూరీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: