అందమైన కళ్లు.. ఆకట్టుకునే రూపం.. ఆమె సొంతం. అద్భుతమైన నటన.. కళ్లు తిప్పుకోలేని అందం ఆమెకు వరం. ఒకానొక ద‌శాబ్దంలో రేఖ‌ బాలీవుడ్ని తన అందచందాలతో ఒక్క వూపు వూపేసింది. అదే సమయంలో తోటి నటుడు, తన కెరీర్ని మలుపు తిప్పిన చిత్రాల్లో నటించిన.. అమితాబ్ తో ఆమె ప్రేమలో పడింది. అప్పటి వరకూ సాదా సీదా సినిమాలు చేసింది రేఖ. అమితాబ్ తో కలిసి.. దో అంజానే లో నటించింది. దాంతో రేఖంటే ఏమిటో అటు ప్రేక్షకులకు, ఇటు అమితాబ్ కూ తెలియవచ్చింది. 

 

తరువాత ముకద్దర్ కా సికిందర్ చిత్రంలో రేఖ, అమితాబ్ లు మళ్లీ కలసి నటించారు. దాంతో.. రేఖ, అమితాబ్ లది హిట్ పెయిర్ గా బాలీవుడ్ గుర్తించింది. రేఖా, అమితాబ్ ల జంట ప్రేక్షకులకు కన్నులపంటగా వుండేది. ఆ ఇద్దరి కాంబినేషన్లో అనేక చిత్రాలు వెల్లువెత్తాయి. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అమితాబ్, రేఖలు కేవలం తెరజీవితంలోనే కాదు నిజజీవితంలోనూ మంచి ప్రేమికులే అన్న పేరొచ్చింది. అది రాను రాను నెగిటివ్  యాంగిల్ లోకి మారి.. జనం నోళ్లలో నానింది. పెళ్లయిన అమితాబ్ ఏంటి.. రేఖతో  ఇలా ప్రేమలో మునిగి తేలడం ఏమిటి? అన్న విమర్శలు పోటెత్తాయి. అందుకు పరాకాష్టగా ‘సిల్ సిలా’ అనే చిత్రం వచ్చింది. ఇది అమితాబ్, రేఖల ప్రణయగాధకు అద్దం పట్టే చిత్రం. అమితాబ్ భార్యగా ఏకంగా జయభాదురి నటించింది. ఇక ఏమ‌యిందో ఏమో తెలియ‌దు కాని సీన్‌లోకి జ‌య‌బాధురి ఎంట‌ర్ అయింది. 

 

అమితాబ్ చాలా పొడ‌వుగా ఉండ‌డంతో ఆయ‌న‌తో న‌టించ‌డానికి అప్ప‌ట్లో హీరోయిన్లు ఎవ్వ‌రూ ఒప్పుకునేవారు కారు దానికి కార‌ణం ఆయ‌న ఎంతో పొడ‌వుగా ఉండ‌డంతో అప్ప‌ట్లో హీరోయిన్లు ఆయ‌న‌తో న‌టించ‌డానికి నిరాక‌రించ‌డంతో జ‌య‌బాధురి ఒక్క‌తే అందుకు ఒప్పుకుంద‌ని ఆమె అంటే అంత అభిమాన‌మ‌ని అంటారు చాలామంది. ఇక ఇదిలా ఉంటే... రేఖ‌ను ఆయ‌న పెళ్ళి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం రేఖ‌కు ఏదో కుజ‌దోషం ఉంద‌ని చెప్పుకునేవార‌ట‌. అందుకే రేఖ ఇప్ప‌టికీ పెళ్ళి చేసుకోకుండా అలానే ఉండిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: