బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత దర్శక ధీరుడు రాజమైళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను పీరియాడిక్‌ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతా రామా రాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించనున్నాడు. ఒక సమయంలో రెండు వేరు వేరు చోట్ల పోరాటాలు చేసిన ఈ ఇద్దరు వీరులు ఒక చోట కలిస్తే ఎలా ఉంటుంది అన్న ఫాంటసీ ఎలిమెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

 

ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ బ్యూటీ ఒలివియా మోరిస్‌ నటిస్తుండగా రామ్‌ చరణ్‌కు జోడిగా అలియా భట్‌ నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌, తమిళ నటుడు సముద్ర ఖని ఇతర కీలక పాత్రలో నటిస్తుండగా విలన్లుగా హాలీవుడ్‌ తారలు కనిపించనున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.


తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డు ధర పలికినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 'ఆర్​ఆర్​ఆర్​' నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్​రాజ్​ సొంతం చేసుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఏకంగా 76 కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమా హక్కులు దక్కించుకున్నాడట దిల్‌ రాజు. విడుదలకు ముందే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.225 కోట్ల ముందస్తు వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది.

 

అయితే, నైజాం పరిధిలో ఇప్పటివరకూ ఏ చిత్రం (బాహుబలితో సహా) 70 కోట్ల కలెక్షన్లు సాధించలేదు. మరి ఏ ధైర్యంతో దిల్ రాజు ఈసినిమా మీద 76 కోట్లు పెట్టాడో అని ఆలోచిస్తున్నారు విశ్లేకులు. 2021, జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో విడుదల కానుంది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: