నాలుగేళ్ళ వ‌య‌సులోనే సార‌క తండ్రి సారిక త‌ల్లిని వ‌దిలి దేశాల వెంబ‌డి వెళ్ళిపోయాడు. చిన్న నాటి నుంచే త‌న కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది. చిన్న‌ప్ప‌టి నుంచి కూడా ఎక్కువ‌గా న‌ట‌నే ప్ర‌ధానంగా ఉండే ఆమె పెద్ద‌గా చ‌దువు కూడా చ‌దువుకోలేదు. ఒక‌రోజు ఓ నిర్మాత ఆమెకు 1800రూపాయ‌లు ఇవ్వ‌గా దాంతో ఆమె పుస్త‌కాలు కొనింది. అది తెలుసుకున్న ఆమె త‌ల్లి సారిక‌ను బాగా కొట్టి ఇంటినుంచి త‌రిమేసింది. దాంతో ఆమె ఒక కారులోనే ఆరు రోజుల పాటు ప‌డుకుంది. త‌న స్నేహితుల ఇంట్లో కాల‌కృత్యాల‌ను పూర్తి చేసుకునేది. స్నానాలు, భోజ‌నాలు అన్నీ స్నేహితుల ఇంట్లో చేసేకునేది. ఇక‌ ఒక యుక్త వ‌య‌సు రాగానే ఆమెను క్రికెట‌ర్ క‌పిల్‌దేవ్ ప్రేమిస్తున్నాని తెలిపారు. కానీ చాలా కాలం త‌ర్వాత తెలిసింది. క‌పిల్‌దేవ్ ఆమెను కేవ‌లం వాడుకునేవాడ‌ని ఆయ‌న‌కి అప్ప‌టికే వివాహం జ‌రిగింద‌ని తెలిసి త‌న బాధ‌ను ఎవ్వ‌రికీ చెప్పుకునేవారు లేక త‌ల్ల‌డిల్లిపోయేది. 

 

అదే స‌మ‌యంలో క‌మ‌ల్ క‌న్ను ఆమె సంపాద‌న పై, ఆమె అందం పై ప‌డింది. సారిక పెద్ద‌గా మేక‌ప్ కూడా వేసేది కాదు ఇత‌రుల బ‌ల‌వంతం మీద ఆమె లిప్‌స్టిక్ వేసేది. విషాద స‌న్నివేశాల్లో న‌టించ‌డంలో ఆమె అప్ప‌టికి ఇప్ప‌టికీ అలానే కొన‌సాగుతోంది. త‌ను మేక‌ప్ లేకుండా విషాద స‌న్నివేశాల్లో న‌టించేది. అవి అంతే క్లారిటీగా సీన్లు పండేవ‌నే చెప్పాలి. ఇంత సింపుల్‌గా ఉండే ఆమె క‌మ‌ల్‌తో పెళ్ళి త‌ర్వాత క‌మ‌ల్ పిల్ల‌లు వ‌ద్ద‌న్నా త‌ను తల్లి కావాల‌నే ఆశ‌తో ఇద్ద‌రు పిల్ల‌ల‌ను క‌నింది.శృతిహాస‌న్‌, అక్ష‌ర‌హాస‌న్ అనే ఇద్ద‌రు పిల్ల‌లకు జ‌న్మ‌నిచ్చింది. క‌మ‌ల్ గౌత‌మితో ఉండ‌డం చూసి బాధ‌ప‌డిన సారిక క‌త్తి తీసుకుని త‌న చేతి న‌రాల‌కు ఇత‌ర కొన్ని చోట్ల గాయాలు చేసుకుంది. 

 

కాని దాని నుండి బ‌య‌ట ప‌డి కూతుర్ల కోసం బ్ర‌త‌కాల‌ని నిర్ణ‌యించుకుంది. చివ‌ర‌కు క‌మ‌ల్‌తో విడిపోయి పిల్ల‌లిద్ద‌రితో మ‌ళ్ళీ కెరియ‌ర్‌ని మొద‌లుపెట్టి లైఫ్‌ని లీడ్ చేస్తుంది. పిల‌లు మాత్రం తండ్రి కోసం బెంగ పెట్టుకోవ‌డం గ‌మ‌నించిన సారిక తండ్రి ద‌గ్గ‌ర ఉంటారా అని అడిగితే పిల్ల‌లు అక్క‌డ ఉండ‌డానికే ఇష్ట‌ప‌డ్డారు. దాంతో పిల్ల‌ల మాట కాద‌న‌లేక తండ్రి వ‌ద్ద‌కు పంపించేసింది. ఆమె మౌన‌మే నేడు ఆమె పిల్ల‌లు విచ్చ‌ల‌విడిగా పెర‌గడానికి కార‌ణ‌మైంది. గొప్ప న‌టులు ఎవ్వ‌రూ గొప్ప‌వారు కాలేరు. ఇక క‌మ‌ల్‌హాస‌న్ పెళ్ళి బంధం పైన పెద్ద‌గా క‌రెక్ట్‌గా ఉండే మ‌నిషికాదు. ఆయ‌న త‌న జీవితం త‌న ఇష్టం అన్న ధోర‌ణిలోనే మొద‌టి నుంచి ఉండేవారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఆయ‌న త‌న కుమార్తెల‌యిన శృతిహాస‌న్ అక్ష‌ర‌హాస‌న్‌ల‌ను కూడా అలాగే పెంచారు. ఆయ‌న ముందు డాన్స‌ర్ అయిన వాణి గ‌ణ‌ప‌తిని వివాహం చేసుకున్నారు. త‌ర్వాత బాల‌న‌టిగా, సింగ‌ర్‌గా మంచి పేరు తెచ్చుకున్న సారిక‌ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఆయ‌న త‌న కూతుర్ల‌ను సింప‌తీతో త‌న ద‌గ్గ‌రే ఉంచుకుని సారిక‌ను మాన‌సికంగా హింస పెట్టాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: