టాలీవుడ్ సినిమా పరిశ్రమకు సాక్షి సినిమా ద్వారా నటుడిగా అడుగుపెట్టిన నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ, తొలి సినిమాతో మంచి విజయం అందుకోవడంతో పాటు, తన ఆకట్టుకునే అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిలో మంచి పేరు దక్కించుకున్నారు. ఇక ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగిన కృష్ణ, ఆపై ఎన్నో గొప్ప విజయవంతమైన సినిమాల్లో నటించి సూపర్ స్టార్ గా బిరుదు గడించారు. ఇక ఒకానొక సమయంలో నటరత్న ఎన్టీఆర్ కు పోటీగా ఎంతో గొప్ప పేరు, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన కృష్ణ సినిమా థియేటర్స్ లోకి వస్తోంది అంటే అభిమానులకు పండుగ వచ్చినట్లే. 

 

చూడటానికి నిండు చంద్రుడిలా తెల్లగా ఎంతో అందంగా ఉండే కృష్ణ, మనసు కూడా అంతే అందంగా ఉంటుందని ఎందరో టాలీవుడ్ ప్రముఖులు ఇప్పటికీ చెప్తూనే ఉంటారు. ఇక ముందుగా ఎవరైనా తనతో సినిమా తీసిన దర్శకుడు, లేదా నిర్మాతకు నష్టం వాటిల్లితే, తదుపరి సినిమా వారికి ఉచితంగా చేయడంతో పాటు, అవసరం అయితే నష్టాల్లో వారికి అవసరమైన సాయాన్ని అందించడంలో కృష్ణ ఎప్పుడూ ముందు ఉండేవారట. ఇక ఎవరైనా నిర్మాత, లేదా దర్శకుడు ఇబ్బందుల్లో ఉంటె, ప్రత్యేకంగా వారిని పిలిపించి ఆదుకోవడంతో పాటు వారికి ఫ్రీగా కాల్ షీట్స్ కేటాయించి మంచి హిట్ సినిమా అందించి లాభాలు అందించేవారట. 

 

అది మాత్రమే కాక, తన ఎదుగుదలకు అభిమానుల అండదండలు ఎంతో కారణం అని ఎప్పుడూ చెప్పే కృష్ణ, అభిమానులను ఎప్పటికప్పుడు తన కుటుంబం వలె భావించి వారికి చేదోడువా దోడుగా ఉండి, వారి కుటుంబాలకు తనవంతుగా సాయం అందించడానికి ఏ మాత్రం సంకోచించేవారుకాదట. ఇక మధ్యలో ఎవరైనా నటులు ఆర్ధికంగా సమస్యల్లో ఉన్న విషయం తన దృష్టికి వస్తే, వెంటనే చలించే కృష్ణ, తనవంతుగా వారికి సాయం అందించేవారట. ఇక కృష్ణ చేసిన ఈ గొప్ప పనులను ఇప్పటికీ టాలీవుడ్ లో చెప్పుకుంటూ ఉన్నారంటే ఆయిన మంచి మనసుకు నిదర్శనం ఇంతకంటే ప్రత్యేకంగా ఏముంటుంది చెప్పండి...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: