ఒకప్పుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి హీరోగా మనీ సినిమా లో కోటా శ్రీనివాసరావు.. ఉత్తేజ్ ని ఉద్దేశించి   ‘భద్రం బీకేర్‌ఫుల్‌ బ్రదరూ..భర్తగ మారకు బ్యాచిలరూ.. షాదీ మాటే వద్దుగురూ.. సోలో బతుకే సో బెటరూ’  అంటూ పాట పాడతారు.  ఈ పాట అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. బ్యాచ్ లర్ గా ఉన్న వారు ఇలాంటి పాటలు పాడుతూ.. తమ లైఫ్ పెళ్లి అనే రొంపలోకి పడబోము అంటూ పాడుకునే వారు.  అయితే ఈ పాట టైటిల్ తో ఇప్పుడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా ‘సోలో బతుకే సో బెటరూ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీతో సుబ్బు అనే నూతన దర్శకుడు వెండి తెరకు పరిచయం అవుతున్నారు. 

 

గత కొంత కాలంగా వరుసగా మంచి హిట్ మ్యూజిక్ తో ట్రెండ్ సృష్టిస్తున్నారు తమన్.  ఈ మూవీకి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.  సాయితేజ్ జోడీగా నభా నటేశ్ కనిపించనుంది. బ్యాచిలర్ లైఫ్ లోనే అసలైన కిక్ వుంది అనుకునే కథానాయకుడి చుట్టూ తిరిగే కథ ఇది. గత ఏడాది చిత్రలహరి, ప్రతిరోజు పండగే సినిమాలతో మంచి విజయాలు అందుకున్న సాయిధరమ్ తేజ్ ఈ మూవీతో హ్యాట్రిక్ విజయం అందుకుంటాడా అన్నది చూడాలి.  చిత్ర లహరి మూవీకి ముందు సాయిధరమ్ తేజ్ నటించిన ఆరు సినిమాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి.. అప్పటి నుంచి కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట ఈ కుర్ర మెగా హీరో.

 

సినిమా నుంచి రేపు సాయంత్రం 5 గంటలకు ఒక వీడియోను విడుదల చేయనున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్ కూడా ఆకట్టుకునేలా వుంది. అయితే ఈ మూవీ తనకు మంచి విజయం అందిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు సాయిధరమ్ తేజ్. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: