ఈ మద్య తెలుగు,తమిళ, హిందీ భాషల్లో సూపర్ హిట్ చిత్రాలను ఇతర భాషల్లోకి రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరహా చిత్రాలు ఈ మద్య బాగానే పెరిగిపోతున్నాయి. ఆ మద్య తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన ‘ఖైదీ’ చిత్రం ఎంత మంచి హిట్ అయ్యిందో తెలిసిందే కదా. ఈ మూవీలో పాటలు లేవు.. విభిన్న కథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఎలాంటి కమర్షియల్ ఎంట్ర టైన్ మెంట్ లేకుండా మంచి కథ, సెంటిమెంట్, నటన ఈ చిత్రం విజయానికి ప్రధానాంశాలుగా నిలిచాయి. ఈ చిత్రంలో కార్తి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగు లో సైతం ఈ చిత్రం మంచి కలెక్షన్లు వసూళ్లు చేసింది.
తాజాగా ఈ చిత్రం బాలీవుడ్ లో రిమేక్ చేసే యోచనలో పడ్డారు. అయితే ఈ మూవి లో కార్తీ పాత్ర ప్రముఖ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా, తమిళంలో ఖైదీ చిత్రం దర్శకత్వం వహించిన లోకేష్ కానగరాజ్ హిందీలోనూ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మరి ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారు అన్న విషయం పై చర్చలు నడుస్తున్నయి. గతేడాది రెండు చిత్రాలు చేసిన హృతిక్.. తన తర్వాతి చిత్రం విషయం ఇప్పటి వరకూ ప్రకటించలేదు.
ఈ చిత్రాన్ని హిందీలో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కలిసి నిర్మించే అవకాశముంది. అయితే ఈ చిత్రంలో లో రణ్‌వీర్‌సింగ్ హీరోగా నటించేందుకు పోటీలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగు, తమిళ్ లో మంచి విజయం అందుకున్న ఈ చిత్రంలో నటించే ఛాన్స్ హృతిక్ కి దక్కుతుందా..? లేక రణవీర్ సొంతం చేసుకుంటాడా అని తెలియాలంటే కొంతకాలం వేచిచూడక తప్పదు.