తమిళ్ లో విజయ్ సేతుపతి త్రిష నటించిన సూపర్ హిట్ సినిమా 96. ఈ సినిమాకి అఫీషియల్ తెలుగు రీమేక్ గా జాను సినిమాని నిర్మించారు. కోలీవుడ్ లో సక్సస్ అయిన ఈ కల్ట్ కంటెంట్ ఉన్న సినిమాని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలుగులో నిర్మించారు. మంచి అంచానలతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో శర్వానంద్ సమంత జంటగా నటించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మీద రిలీజ్ కి ముందు కాసో కూస్తో ఆసక్తి నెలకొన్నప్పటికి రిలీజైయ్యక మాత్రం దెబ్బ పడింది. కంప్లీట్ కల్ట్ కంటెంట్ కాబట్టి కామన్ ఆడియన్స్ లో ఎక్కువ శాతం ఆడియన్స్ కి నచ్చలేదు. ఇక ఈ సినిమాని తమిళంలో తెరకెక్కించిన దర్శకుడు సి.ప్రేం కుమార్ తెలుగులోనూ తెరకెక్కించడం చాలావరకు మైనస్ గా మారింది.

 

హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ని తీసుకొని చెడగొట్టారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సినిమాలో హీరో, హీరో స్కూల్ డేస్లో ప్రేమించిన అమ్మాయి తర్వాత పెరిగి పెద్దయి మిడిల్ ఏజ్ వచ్చాక కలిస్తే ఎలా ఉంటుంది అన్న అంశం తో తెరకెక్కించారు. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో దర్శకుడు తెరకెక్కించడం విశేషం. ఇక ఈ సినిమాలో లవ్ ఫీల్ ఎక్కడా డ్రాప్ కాకుండా దర్శకుడు తెరకెక్కించినప్పటికి అది ఏమాత్రం వర్కౌట్ అవలేదు. ముఖ్యంగా యూత్ ని బాగా అట్రాక్ట్ చేయగలగాలి. కాని ఆ విషయంలో దర్శకుడు ఫేయిల్ అయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమాలో శర్వానంద్ సమంత నటనకు అందరూ ఫ్లాటైనపటికి.. సమంత శర్వానంద్ జోడీ మాత్రం చూడటానికి ఆసక్తికరంగా అనిపించలేదు.

 

అందుకే సమంత పక్కన శర్వా అసలు సూటవలేదని. నటన పరంగా ఇద్దరు ఆకట్టుకున్నప్పటికి పేయిర్ పరంగా ఇద్దరికి ఏమాత్రం మ్యాచ్ అవలేదని అదే సినిమాకి మేయిన్ మైనస్ అని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. కొన్ని సీన్స్ లో సమంత పక్కన శర్వా అంటే ఊహించుకోవడానికి కూడా బాలేదట. అయితే సమంత నాగ చైతన్య కలిసి నటించిన మజిలీ అందరినీ అన్ని రకాలుగా ఆకట్టుకుంది. దాంతో సమంత పక్కన శర్వాని చూడలేకపోయారు. ఇదే విషయం చైతూ కూడా సమంత తో అన్నాడట. వాస్తవంగా ఈ సినిమాలో ముందు చైతు సమంత నే నటించాలి. కాని చైతూ డ్రాపయ్యాడు. సమంత కూడా చైతూలాగానే డ్రాపయితే బావుందేది. కాని దిల్ రాజు ఫోర్స్ వల్ల ఒప్పుకుంది. ఫలితం సినిమా సమంత అకౌంట్ లో డిజాస్టర్ మూవీగా పడింది. ఈ విషయంలో చైతూ సమంతకి వార్నింగ్ ఇచ్చి సీరియసయ్యాడట.  

మరింత సమాచారం తెలుసుకోండి: