బాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఆషికి 2 అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ శ్రద్ధ కపూర్. తన తండ్రి శక్తి కపూర్ నట వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చిన శ్రద్ధ, ఫస్ట్ సినిమా తోనే సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో పాటు తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఎందరో అభిమానులని సంపాదించుకుంది. ఇక ఆ తరువాత వరుసగా అవకాశాలు అందుకుని పలు సక్సెస్ లతో పాటు కెరీర్ పరంగా ఫెయిల్యూర్స్ కూడా చవిచూసిన శ్రద్ధ ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సాహో సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీ కి కూడా హీరోయిన్ గా పరిచయం అయింది. సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సంస్థ అత్యంత భారీ ఖర్చుతో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కబడిన ఆ సినిమా

 

ఇటు సౌత్ లో మాత్రం సక్సెస్ కాలేదు. అయితే అటు బాలీవుడ్ లో మాత్రం మంచి కలెక్షన్ దక్కించుకుంది. తనకు సౌత్ ఇండస్ట్రీ అంటే ఎంతో ఇష్టం అని, ఇక్కడి హీరోల్లో తనకు సూపర్ స్టార్ మహేష్, రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఎంతో ఇష్టం అని చెప్పిన శ్రద్ధ, ఊహించని విధంగా సాహో సినిమా సౌత్ లో పరాజయం పాలవడంతో ఒక్కసారిగా షాక్ కు గురైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక  తరువాత నుండి ఆమెకు అక్కడక్కడా సౌత్ లో కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె మాత్రం వాటిపై పెద్దగా దృష్టి పెట్టలేదని అంటున్నారు. 

 

ఇక ఇటీవల టాలీవుడ్ లోని ఒక స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధను అనుకుని, ఆమెకు కథ వినిపిద్దాం అని ఒక సినిమా దర్శకుడు సిద్ధం అవుతున్న తరుణంలో, విషయం ఆమె వద్దకు చేరడంతో శ్రద్ధ ఆ సినిమాలో నటించడానికి ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదని బాలీవుడ్ వర్గాల టాక్. ఛ, ఇప్పటికే అక్కడి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించాలని భావించి ఒక సినిమా చేస్తే అది ఏమాత్రం సక్సెస్ కాకపోవడంతో నా ఆశలన్నీ అడియాశలయ్యాయి. అందుకే ఒక్కసారి చేసిన ఆ తప్పుతో కుమిలిపోయానని, కావున ఇకపై సౌత్ సినిమాలు చేయలేనని ఆ దర్శకుడికి ఆమె తేల్చి చెప్పినట్లు టాక్. మరి ఇది నిజమో కాదో తెలియదు కానీ ఈ వార్త మాత్రం రెండు రోజులుగా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: