అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్‌ కు పరిచయం అయిన నటుడు నాగ చైతన్య. కెరీర్‌ లో నిలదొక్కుకునేందుకు చాలా సమయం పట్టినా ప్రస్తుతం ఈ యంగ్‌ హీరో మంచి ఫాంలో ఉన్నాడు. తండ్రి మన్మథుడు ఇమేజ్‌ ను కాపాడుతూ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్ల తో అలరిస్తున్నాడు. ఇటీవల మజిలీ సినిమాతో నటుడిగా సూపర్‌ అనిపించుకున్న చైతూ, మామ వెంకీతో కలిసి వెంకీ మామ సినిమాలో సందడి చేశాడు. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్‌ స్టోరి సినిమాలో నటిస్తున్నాడు చైతూ.

 

అయితే సెలబ్రిటీ సినీ విశేషాలే కాదు వారి పర్షనల్ లైఫ్‌కు సంబంధించిన విశేషాలు కూడా తెలుసుకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు అభిమానులు. రెండు పెద్ద కుటుంబాలకు వారసుడైన చైతూ ఆస్తి ఎంత, ఒక్కో సినిమాకు చైతూ ఎంత రెమ్యూనరేషన్‌ తీసుకుంటాడన్న విషయాలపై అభిమానులతో పాటు సాధారణ జనాల్లోనూ ఎంతో ఆసక్తి ఉంటుంది. టాప్‌ స్టార్ రేంజ్‌కు ఎదగకపోయినా మినిమమ్‌ గ్యారెంట్ హీరోగా ప్రూవ్‌ చేసుకున్న చైతూ రెమ్యూనరేషన్ పరంగా ఇతర హీరోలతో పోల్చుకుంటే కాస్త తక్కువే చార్జ్‌ చేస్తున్నాడు.

 

ప్రస్తుతం చైతూ ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడు. ఇక ఆయన ఆస్తి పాస్తుల విషయానికి వస్తే చైతూ ఒక తాత మూవీ మొఘల్ రామానాయుడు కాగా, మరో తాత లెజెండరీ యాక్టర్ నాగేశ్వరరావు.. ఈ ఇద్దరి నుంచి చైతుకు దాదాపు 45 కోట్ల వరకు ఆస్తులు వచ్చినట్టుగా ప్రచారం ఉంది. అంతేకాదు ప్రస్తుతం చైతూ సినిమాలు ఇతర బిజినెస్‌లతో కలిపి ఏడాది 15 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు.

 

స్వతహాగా రేసర్‌ అయిన చైతన్య దగ్గర ఓ లగ్గరియస్‌ రేసింగ్ కారు కూడా ఉంది. ఈ కారు ధర మూడు కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అంతేకాదు కొన్ని కాస్ట్‌లీ స్పోర్ట్స్‌ బైక్‌ను కూడా నాగ చైతన్య కలెక్షన్‌లో ఉన్నాయి. అప్పుడప్పుడు ఈ స్పోర్ట్స్‌ బైక్‌లు, కార్ల మీద రయ్‌ రయ్‌ మంటూ దూసుకుపోతుంటాడు చైతన్య.

మరింత సమాచారం తెలుసుకోండి: