నాడు అమితాబ్ బచ్చన్ నుంచి అక్కినేని నాగార్జున మీదుగా నేడు అక్కినేని నాగచైతన్య వరకు విజయవంతమైన ప్రేమకథలెన్నో! అదే సందర్భంలో ప్రేమనే శ్వాసిస్తూ, శాసిస్తూ, స్మరిస్తూ... ఆ ప్రయాణంలో విజయం సాధిస్తూ..అంతలోనే విఫలమవుతూ మళ్లీ మళ్లీ మునిగి తేలాలనే తహతహలాడే ‘నయనా’నందకర అకాంక్షలకూ వెండితెర వేదికే. ప్రేమ గెలిస్తే...అది మధుర వ్యాపకం. ఓడితే ఎప్పటికీ మరిచిపోలేని ఓ తీపి జ్ఞాపకం.
సూర్య, జ్యోతిక పలు చిత్రాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అనంతరం 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తమిళ ఇండస్ట్రీలో తనకో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడమే కాకుండా సూర్య ఈ సినిమా ద్వారా తన ప్రేమను కూడా సంపాదించుకున్నారు.ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే సూర్య–జ్యోతిక ప్రేమలో పడ్డారని అప్పట్లో కోలీవుడ్‌లో చెప్పుకునేవారు. అలా సూర్య–జ్యోతికల లైఫ్‌లో స్వీట్ మెమరీగా నిలిచిపోయే ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే ప్లాన్ ఇప్పుడు జరుగుతోందట. ఈ సీక్వెల్‌తోనే సూర్య– జ్యోతిక మళ్లీ కలసి నటించ బోతున్నారట. పెళ్లికి ముందు ‘నువ్వు నేను ప్రేమ’ చిత్రంలో ఇద్దరూ కలసి తిరిగి నటించనున్నారట. వీరిద్దరి పెళ్లయిన పన్నెండేళ్ళు అయిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఓసారి అసలు తన లవ్‌స్టోరి ఎలా మొదలయిందో మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఆయన ఇప్పుడదేంటో చూద్దాం.
మా ప్రేమ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కానేకాదు. మేము మొదటి నుంచి కూడా మంచి స్నేహితులం. ఇద్దరం కలిసి కొన్ని సినిమాల్లో నటించాం. దాంతో మా మధ్య ఏదో ఉందని మీడియా కథనాలు రాసేసింది. అలాంటిదేమీ లేకపోవటంతో ఆ వార్తలు చదువుకుని ఇద్దరం నవ్వుకునే వాళ్లం. అప్పట్లో నాకంటే జ్యోతిక మంచి ఫామ్‌లో ఉండేది. నాకేమో అవకాశాలు తగ్గటంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఫిట్నెస్ మీద ధ్యాస పెట్టాను. జ్యోతికతో మాటలు కూడా తగ్గాయి. దాంతో ఒకరోజు జ్యోతిక నేరుగా నా దగ్గరికొచ్చి ‘నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావు?’ అని అడిగేసింది. ఆ తర్వాత ఇద్దరం ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. అలా నెమ్మదిగా మా స్నేహం కాస్తా ప్రేమగా మారింది. మరి ఈ క్యూట్ లవ్ స్టోరి వినడానికి చాలా బావుంది కదా. అలాగే వీరి జంట కూడా అంతే క్యూట్‌గా ఉంటుంది.