గత వారం విడుదలైన ‘జాను’ దిల్ రాజ్ కు ఊహించని షాక్ ఇవ్వడమే కాకుండా ఈ మూవీ వల్ల దిల్ రాజ్ కు 10 కోట్లుకు పైగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. వాస్తవానికి ఒక మూవీ ఒక భాషలో హిట్ అయితే ఆ మూవీ రీమేక్ హక్కుల కోసం విపరీతమైన పోటీ ఏర్పడుతుంది. 


అయితే ‘96’ మూవీ తమిళంలో విడుదల కాకుండానే ఆ మూవీ టీజర్ ను చూసి విపరీతంగా మోజు పడి ఈ మూవీ రీమేక్ రైట్స్ ను ముందుగానే కొన్నాడు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చదు అని అనేకమంది చెప్పినా ఆ విషయాలు పట్టించు కోకుండా దిల్ రాజ్ చాల ధైర్యంగా ఈ మూవీని రీమేక్ చేసి భారీగా ప్రమోట్ చేసి మరీ విడుదల చేసాడు. 


ఇప్పుడు ఈ మూవీ ఫలితం తేలిపోవడంతో ఈ మూవీ నష్టాలు పరోక్షంగా నాని నటిస్తున్న ‘వి’ మూవీ భరించాల్సి వస్తోంది. నాని 25వ సినిమాగా krishna INDRAGANTI' target='_blank' title='ఇంద్రగంటి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇంద్రగంటి మోహన్ కృష్ణ తీస్తున్న ‘వి’ మూవీను కూడ దిల్ రాజ్ నిర్మిస్తున్నాడు. సాధారణంగా దిల్ రాజ్ సినిమాలకు బయ్యర్లు ఎప్పుడు ఒక్కరే ఉంటారు. ఇప్పుడు ‘వి’ ని తీసుకున్న బయ్యర్లు కూడ ‘జాను’ బయ్యర్లే అవ్వడంతో ‘జాను’ వల్ల బయ్యర్లకు వచ్చిన నష్టాల మొత్తాలలో కొంత బాగం తగ్గించి ఇప్పుడు వారికి నాని ‘వి’ ని దిల్ రాజ్ ఇవ్వవలసి వస్తోంది అన్న ప్రచారం జరుగుతోంది. 


‘జాను’ ఇచ్చిన ఫలితంతో ఇక రానున్న రోజులలో తెలుగులో ఉదాత్తమైన ప్రేమ కథల  సినిమాలు ఇక వచ్చే ఆస్కారం లేదు అని అంటున్నారు. కేవలం ఘాడమైన లిప్ లాక్ సీన్స్ ఉంటూ ప్రేమ కథలను చాల ఉద్వేగంగా వెరైటీగా చూపించ గలిగిన లవ్ స్టోరీస్ మాత్రమే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలాంటి పరిస్థితులలో రేపు రాబోతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ త్వరలో విడుదల కాబోతున్న నాగచైతన్య సాయి పల్లవి ల ‘లవ్ స్టోరీ’ మూవీ ఫలితం బట్టి భవిష్యత్ లో తెలుగులో ప్రేమ కథల సినిమాలు వస్తాయా రావా అన్నది తేలిపోతుంది అని అంటున్నారు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: