టాప్ హీరోలు అందరితోను అనేక బ్లాక్ బష్టర్ సినిమాలను తీసిన వివి వినాయక్ కు తాను నటించిన తన సినిమా ఏమాత్రం నచ్చకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది. వినాయక్ ప్రత్యేక పాత్రలో నటిస్తూ కథ అంతా అతడి చుట్టూ తిరిగే ‘శీనయ్య’ మూవీని చాల భాగం తీసిన విషయం తెలిసిందే. 

యంగ్ డైరెక్టర్ నరసింహ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కోసం తన లుక్ ను తన హెయిర్ స్టైల్ ను మార్చుకున్న వినాయక్ ఇదే లుక్ తో అనేక ఫిలిం ఫంక్షన్స్ కు కూడ వచ్చాడు. అయితే చివరకు ఈ మూవీ మధ్యలో ఆగిపోవడానికి గల కారణం వినాయక్ తీసుకున్న షాకింగ్ నిర్ణయం అని అంటున్నారు. 


తెలుస్తున్న సమాచారం మేరకు వినాయక్ ఇప్పటి వరకు తీసిన ఈ మూవీ అవుట్ పుట్ చూసి పెదవి విరచడమే కాకుండా స్క్రీన్ పై తన ప్రెజన్స్ లుక్ కూడ బాగాలేదు అన్న అభిప్రాయంలోకి వచ్చినట్లు సమాచారం. దీనితో ఈ సినిమాను కొనసాగించి ఆపై విడుదల చేసి నిర్మాత దిల్ రాజ్ కు ఆర్ధిక నష్టాలు కలిగించేకంటే ముందుగానే మేల్కొని తక్కువ నష్టంతో బయటపడటం మంచిదని వినాయక్ స్వయంగా దిల్ రాజ్ కు సలహా ఇచ్చినట్లు టాక్. 


అంతేకాదు ఈ మూవీ వల్ల దిల్ రాజ్ కు ఏర్పడ్డ నష్టాలను అవసరం అనుకుంటే తాను కూడ భారిస్తానని వినాయక్ స్వయంగా దిల్ రాజ్ కు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు దర్శకరత్న గా ఇండస్ట్రీని ఏలిన దాసరి నారాయణరావు కళా తపస్విగా ఎన్నో మంచి సినిమాలు తీసిన విశ్వనాథ్ నటులుగా కూడ ఎంతో రాణించారు. అయితే ఆ అడుగుజాడలలోనే పయనిద్దామని వినాయక్ చేసిన ప్రయత్నాలు ఆదిలోనే బెడిసి కొట్టడం షాకింగ్ విషయం

మరింత సమాచారం తెలుసుకోండి: