డియర్ కామ్రేడ్  ఫలితం సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మార్కెట్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. ఎందుకంటే తాజాగా విజయ్ నటించిన  వరల్డ్ ఫేమస్ లవర్ 50కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి అదుర్స్ అనిపించింది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా థియేట్రికల్ హక్కులు 23కోట్లకు అమ్ముడవ్వగా మిగితా ఏరియాలతోపాటు ఓవర్సీస్ తో కలుపుకొని మరో 7కోట్ల బిజినెస్ చేసింది. ఇక నాన్ థియేట్రికల్ రూపంలో మరో 20కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 7కోట్లకు ,డిజిటల్ రైట్స్ 5కోట్లకు అమ్ముడవ్వగా హిందీ రైట్స్ 8కోట్లకు అమ్ముడయ్యాయి.  
 
ఇటీవల విజయ్ నటించిన అర్జున్ రెడ్డి అక్కడ  కబీర్ సింగ్ గా రీమేక్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ కావడం అలాగే డియర్ కామ్రేడ్  హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్ లో కోట్లల్లో వ్యూస్ ను రాబట్టడం తో  విజయ్ కి హిందీలోకూడా మార్కెట్ క్రియేట్ అయ్యింది దాంతో ఫేమస్ లవర్ హిందీ హక్కులు భారీ ధర పలికాయి.  మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో నాలుగు ప్రేమ కథల ఆధారంగా తెరకెక్కిన ఈచిత్రంలో క్యాథెరిన్ ట్రెసా ,ఐశ్వర్య రాజేష్, రాశీ ఖన్నా, ఇజబెల్లా, హీరోయిన్లుగా నటించగా గోపి సుందర్ సంగీతం అందించాడు.  
 
క్రియేటివ్ కమ్మర్షియల్ పతాకం పై కేఎస్ రామారావు నిర్మించిన ఈచిత్రం ప్రేమికుల రోజు కానుకగా  ఈనెల 14న  ప్రేక్షకులముందుకు రానుంది. మరి గత ఏడాది డియర్ కామ్రేడ్  తో షాక్ తిన్నవిజయ్, ఫేమస్ లవర్ తోనైనా  హిట్ కొడతాడో లేదో చూడాలి. ఇక  విజయ్ ప్రస్తుతం ,డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తన 10వ సినిమాలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నఈ చిత్రంలో అనన్య పాండే  హీరోయిన్ గా నటిస్తుండగా కరణ్ జోహార్ , పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: