అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్‌ యంగ్ హీరో నాగచైతన్య. ఇప్పటికే సక్సెస్‌ ఫుల్ హీరో అనిపించుకున్న చైతూ స్టార్ ఇమేజ్‌ కోసం కష్టపడుతున్నాడు. లవర్‌ బాయ్‌ ఇమేజ్‌తో ఆకట్టుకుంటున్న నాగచైతన్యకు మాస్‌హీరోగా ప్రూవ్ చేసుకోవాలన్న కోరిక చాలా కాలంగా ఉంది. అయితే నాగచైతన్య మాస్ హీరోగా చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్‌ ముందు బోల్తా పడటంతో ప్రస్తుతం ఎక్కువగా లవ్‌ స్టోరీల మీదే దృష్టి పెట్టాడు నాగచైతన్య.

 

అయితే ప్రస్తుతం నాగ చైతన్య కెరీర్‌ ఫుల్‌ ఫాం లో ఉంది. వరుసగా మజిలీ, వెంకీ మామ సక్సెస్‌ లతో చైతు జోష్ లో ఉన్నాడు. దీంతో అక్కినేని నటవారసుడు రెమ్యూనరేషన్‌ కూడా భారీగా పెంచేశాడట. ఇప్పటి వరకు ఒక్కో సినిమా 4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు  పారితోషికం అందుకుంటున్న ఈ యంగ్ హీరో తదుపరి చిత్రాలకు మరో రెండు కోట్ల పెంచింతేగాని చేసేది లేదని చెప్పేస్తున్నాడట. దీంతో నాగచైతన్య కోసం కథలు సిద్ధం చేసుకున్న దర్శక నిర్మాతలు తలలు పట్టుకున్నారు.

 

ప్రస్తుతం నాగ చైతన్య లవ్‌ స్టోరి సినిమాలో నటిస్తున్నడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు కాఫీ లాంటి చిత్రాల దర్శకుడు శేఖర్‌ కమ్ముల దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే పోస్టర్లతో ఆకట్టుకున్న టీం త్వరలో ప్రేమికుల రోజు సందర్భంగా మ్యూజికల్ ప్రీవ్యూ పేరుతో ఓ సాంగ్‌ టీజర్‌ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

సినిమా తరువాత గీతా గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వం లో మరో సినిమా చేస్తున్నాడు చైతూ ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్ఫణలో గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌ లో నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలతో పాటు నాగార్జునతో కలిసి ఓ మల్టీ స్టారర్‌ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నాడు  చైతూ. సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్‌గా తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమాలో చైతూ గెస్ట్ రోల్‌ లో కనిపించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: