సాధారణంగా ఎక్కడైనా ఓ సామెత ఉంటుంది.. గెలిచినోడిదే రాజ్యం.. గెలుపు ఎక్కడ ఉంటుందో.. లక్ష్మీ, గౌరవం అన్నీ అక్కడే ఉంటాయని అంటారు.  పరాజయం పొందిన వారికి అన్నీ కష్టాలే.. కాకపోతే ఒక్క అవకాశం వస్తే తామెంటో నిరూపించుకుంటా అనేవారు కూడా ఎంతో మంది ఉన్నారు.  ఎక్కడైనా ఒకే కానీ ఈ గెలుపు ఓటమి అనేది సినీమా పరిశ్రమలో చాలా దారుణంగా ఉంటాయి.  వరుసగా రెండు మూడు హిట్ సినిమాలు పడితో ఆ హీరోని  ఓ రేంజ్ లో పొగిడేస్తారు.. అతన్నే మిగతా దర్శక, నిర్మాతలు దేవుడిలా చూస్తుంటారు.  కానీ ఎంత పేరు ఉన్న హీరో అయినా వరుసగా డిజాస్టర్ అయితే మాత్రం నిర్మోహమాటంగా పక్కన బెడతారు. ఇటీవల తమిళనాట వరుస విజయాలు అందుకుంటున్న విజయ్, అజిత్ లను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు దర్శక, నిర్మాతలు.  

 

ఇక ప్రపంచ స్థాయిలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ నటిస్తున్న సినిమాలు వరుస డిజాస్టర్స్ కావడంతో ఆయన పారితోషికం కూడా తగ్గించినట్లు వార్తలు వస్తున్నాయి.  అంటే సినీ ఇండస్ట్రీలో గెలిచినోడిదే రాజ్యం అని చెప్పకనే చెబుతున్నారు.  తాజాగా చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ హీరోగా తనకంటూ మంచి క్రేజ్ ఏర్పాటు చేసుకున్న నటుడు శర్వానంద్. అలాంటిది ఈ హీరోకి శతమానం భవతి తర్వాత వరుస డిజాస్టర్స్ రావడం మొదలయ్యాయి. శర్వానంద్ చేసిన 'పడి పడి లేచే మనసు'.. 'రణరంగం' సినిమాలు నిరాశపరిచాయి.

 

ఇక తమిళ, కన్నడ నాట మంచి హిట్ టాక్ వచ్చిందని ‘జాను’ సినిమాలో నటించాడు.  కానీ 22 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా, వసూళ్లపరంగా ఈ ఫిగర్ కి చాలా దూరంలో ఉండిపోవడంతో నష్టాలు తప్పవని చర్చించుకుంటున్నారు. కంటెంట్ ఉంటేనే కదిలే నటుడాయన. అలాంటి శర్వానంద్ ఖాతాలోకి 'జాను' పేరుతో మరో పరాజయం చేరిపోయింది. దాంతో ఇకముందు కథల ఎంపిక విషయంలో శర్వానంద్ మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: