క‌మ‌ల‌హాస‌న్ అన్ని రంగాల్లో మంచి ప్రావిణ్యం గ‌ల వ్య‌క్తి సినిమా రంగంలో అన్నిటిపైన మంచి గ్రిప్ ఉన్న వ్య‌క్తి. ఆయ‌న ఒక న‌టుడు, ప్రొడ్యూస‌ర్‌, ద‌ర్శ‌కుడు, రైట‌ర్‌, సినిమాటోగ్రాఫ‌ర్, ఒక లిసిసిస్ట్ కూడా  ఇలా అన్ని రంగాల పైన మంచి ప‌ట్టు ఉన్న వ్య‌క్తి. ఆయ‌న‌కి క‌ల‌ర్‌ఫుల్ క‌న్న‌మ్మ చిత్రానికి రాష్ట్ర‌ప‌తి అవార్డును కూడా గెలుచుకున్నారు. అంతేకాక నాలుగు జాతీయ అవార్డుల‌ను, 19అంత‌ర్జాతీయ అవార్డుల‌ను ద‌క్కించుకున్నారు.అంతేకాక 1999లోఆయ‌న‌కి ప‌ద్మ‌శ్రీ 2014లో ప‌ద్మ‌విభూష‌ణ అవార్డుల‌ను సాధించారు. హీరో కమలహాసన్ జీవితంలో ఉన్న మలుపులు సంచలనాలు మరి ఏ హీరో జీవితంలోను ఉండవేమో. అటువంటి హీరో జీవితం పై ఒక పుస్తకం వస్తే అది హాట్ టాపిక్ గానే మారుతుంది. ఎందుకంటే, ఆయన వృత్తిజీవితం, వ్యక్తిగత జీవితం రెండూ విచిత్రంగానే ఉంటాయి.

 

 ఇక ఆయ‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న కెరియ‌ర్ స్టార్టింగ్‌లోనే మంచి డ్యాన్స‌ర్‌గా పేరు పొందిన వాణి గ‌ణ‌ప‌తి ఆయ‌న 24ఏళ్ళ వ‌య‌సులో ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరిద్ద‌రి జీవితం దాదాపు ప‌దేళ్ళ పాటు సాగింది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందోగాని వారిద్ద‌రి మ‌ధ్య విభేదాలు వ‌చ్చి కొంత కాలానికే విడిపోయారు. ఆ త‌ర్వాత బాలీవుడ్ హీరోయిన్ సారిక‌ను ఆయ‌న ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. సారిక వ‌య‌సులో త‌న‌కంటే చాలా చిన్న‌ది. వీరిద్దరి సంతానమే శృతి హాసన్, అక్షర హాసన్.

 

 సారిక చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మంచి పేరు సంపాదించింది. దీంతో క‌మ‌ల్ క‌న్ను ఆమె సంపాద‌న పై, ఆమె అందం పై ప‌డింది. అప్ప‌ట్లో సారిక పెద్ద‌గా మేక‌ప్ కూడా వేసేది కాద‌ట‌. ఇత‌రుల బ‌ల‌వంతం మీద ఆమె లిప్‌స్టిక్ వ‌ర‌కు మాత్రం వేసేద‌ట‌. విషాద స‌న్నివేశాల్లో న‌టించ‌డంలో ఆమె అప్ప‌టికి ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఆమెకు ఎవ్వ‌రూ సాటిరార‌నే చెప్పాలి. త‌ను మేక‌ప్ లేకుండా విషాద స‌న్నివేశాల్లో న‌టించేందుకు ప్ర‌త్యేకంగా ద‌ర్శ‌కుల‌ను ప‌ర్మిష‌న్ అడిగేదంట‌. అవి అంతే క్లారిటీగా సీన్లు పండేవ‌నే చెప్పాలి. అలా చేస్తేగాని సీన్ పండ‌ద‌ని త‌ను ప్ర‌త్యేకించి ద‌ర్శ‌కుల‌కు చెప్పేద‌ట‌. ఇంత సింపుల్‌గా ఉండే ఆమె క‌మ‌ల్‌తో పెళ్ళి త‌ర్వాత క‌మ‌ల్ పిల్ల‌లు వ‌ద్ద‌న్నా త‌ను తల్లి కావాల‌నే ఆశ‌తో ఇద్ద‌రు పిల్ల‌ల‌ను క‌నింది.శృతిహాస‌న్‌, అక్ష‌ర‌హాస‌న్ అనే ఇద్ద‌రు పిల్ల‌లకు జ‌న్మ‌నిచ్చింది. క‌మ‌ల్ గౌత‌మితో ఉండ‌డం చూసి బాధ‌ప‌డిన సారిక ఇక తాను క‌మ‌ల్‌తో ఉండ‌టం ఇష్ట‌లేక విడిపోయార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: