హీరోగా తీరికలేకుండా సినిమాలు చేస్తున్న నాని ఒక వైపు సినిమాలు చేస్తూనే రెండేళ్ల కింద‌ట నిర్మాత‌గా మారిన విషయం తెలిసిందే. షార్ట్ ఫిలిమ్స్‌తో మంచి పేరు సంపాదించిన ప్ర‌శాంత్ వ‌ర్మఅనే వ్యక్తిని దర్శకుడిగా పరిచియం చేస్తూ ‘అ!’ మూవీని నాని తీసాడు. మంచి నిర్మాణ విలువ‌ల‌తో ఈసినిమాను నిర్మించినా ఈ మూవీకి విమర్శకుల ప్రశంసలు లభించాయి కాని నష్టాలు తప్పలేదు. 

ఈ సినిమాకు మిశ్ర‌మస్పంద‌న ల‌భించింది. కొంద‌రు ఈ సినిమాను గొప్ప సినిమా అంటే   మరికొందరు నాని వ్య‌ర్థ ప్ర‌య‌త్నం చేసాడు అంటూ కామెంట్స్ చేసారు. దీనితో ఈమూవీ  రిలీజ్ త‌ర్వాత ఎప్పుడూ నానిసినిమా గురించి ఒక్కమాట మాట కూడా మాట్లాడ లేదు. దీని తరువాత ప్రశాంత్ వర్మ రాజశేఖర్ తో ‘కల్కి’ అన్న మూవీని తీసినా ఆ సినిమా కూడ విజయం సాధించలేదు. 


ఇలాంటి పరిస్థితులలో ప్రశాంత్ వర్మను ప్రస్తుతం ఎవరు పట్టించు కోవడంలేదు. ఈ నేపధ్యంలో ఈ డైరెక్టర్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ‘అ!’ సినిమాను నెట్ ఫ్లిక్స్ ఇండియా సంస్థ ట్విట్ట‌ర్లో ప్ర‌శంసించిన విషయం బయటపెట్టాడు. తాను ‘అ!-2’ కు సంబంధించిన స్క్రిప్ట్ ను కూడ పూర్తి చేసానని ఈ మూవీని నాని ఎప్పుడు నిర్మిస్తే తాను మొదలు పెట్టడానికి రెడీ అన్న సంకేతాలు ఇస్తున్నాడు.


అయితే తెలుస్తున్న సమాచారం మేరకు నాని ‘అ 2’ సీక్వెల్ విషయంలో పెద్దగా ఆసక్తి కనపరచక పోవడంతో ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ అఖిల్ చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. అయితే అఖిల్ కూడ  ప్రశాంత్ వర్మకు సరైన సమాధానం ఇవ్వకుండా తాను ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో నటిస్తున్న మూవీ రిజల్ట్ వచ్చిన తరువాత తన నిర్ణయం చెపుతానని పెండింగ్ లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో తనకు లైఫ్ ఇచ్చిన నాని అందుబాటులో లేక అఖిల్ బుట్టలో పడకపోవడంతో  తన ‘అ 2’ కు హీరోల వేటలో ఈ యంగ్ డైరెక్టర్ ఉన్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: