స్టార్‌ వారసుడి ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్‌ హీరోగా ప్రూవ్ చేసుకోవటంలో ఫెయిల్ అయ్యాడు. కథల ఎంపికలో ఈ యంగ్ హీరో చేసిన పోరపాట్లు అతని కెరీర్‌ను కష్టాల్లో పడేశాయి. దీంతో కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నాడు మనోజ్‌. అయితే అదే సమయంలో వ్యక్తిగత జీవితంలోనూ మనోజ్‌ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ప్రేమించి పెళ్లి చూసుకున్న అమ్మాయితో కొద్ది రోజులకే విడాకులు తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం పూర్తిగా తన కెరీర్‌ మీదే దృష్టి పెడతానంటున్నాడు మనోజ్‌.

 

దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత మంచు మనోజ్ తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గురువారం తన నెక్ట్స్‌ సినిమాకు సంబంధించిన వివరాలు ప్రకటించాడు. సినిమాకు  అహం బ్రహ్మాస్మి  అనే టైటిల్‌ను ఖరారు చేసారు. అంతేకాదు ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో మొత్తం ఐదు భాషల్లో చేస్తున్నట్టుగా వెల్లడించాడు.

 

బాలనటుడిగా మోహన్‌ బాబు సినిమాలో నటించిన మనోజ్‌ , 2004లో వచ్చిన దొంగ దొంగది సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత బిందాస్, వేదం లాంటి సినిమాలతో మంచి పేరు వచ్చినా చెప్పుకోదగ్గ సక్సెస్‌ మాత్రం దక్కలేదు. శౌర్య, ఎటాక్, గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు లాంటి సినిమాలు మనోజ్‌ కెరీర్‌ను దారుణంగా దెబ్బతీశాయి. దీంతో ఆలోచనలో పడ్డ మనోజ్‌ కెరీర్‌లో కాస్త బ్రేక్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.


మూడేళ్ల విరామం తరువాత అహం బ్రహ్మాస్మి సినిమాలో నటిస్తున్నాడు. మనోజ్‌ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమా గురించి మనోజ్ ట్వీట్ చేస్తూ దొంగ దొంగది సినిమా చేస్తున్నప్పుడు ఎలాంటి ఎమోషన్ ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని అన్నాడు. తన లైఫ్‌ అనుకున్న కళను ఇన్నాళ్లూ చాలా మిస్సయ్యాను.. `సినీ అమ్మా వచ్చేసా` అంటూ ఎమోషనల్‌గా ట్వీట్ చేశాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: