వెండితెర పై రొమాన్స్ పండించడంలో తమదైన బ్రాండ్ సెట్ చేసుకున్న అక్కినేని కుటుంబంలో, ఆఫ్‌స్క్రీన్ లవ్‌స్టోరీలు అప్పుడూ, ఇప్పుడూ సెన్సెషన్ సృష్టించాయనే చెప్పాలి. అక్కినేని నాగేశ్వరరావుని కూడా అన్నపూర్ణని ఇష్టపడి ప్రేమించి వివాహం చేసుకున్నారట. ‘విక్రమ్’ సినిమాతో ‘తెరగేట్రం చేసి అక్కినేని నటవారసత్వాన్ని అందుకున్న నాగార్జున ‘శివ’ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా ‘టాలీవుడ్ మన్మధుడి’గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. సినిమాల్లో నటిస్తున్న తొలినాళ్లలో సహచర నటి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమల కూడా అక్కినేని కోడలిగా ఎంచక్కా ఇమిడిపోయి ఇటు సామాజిక సేవారంగంలో తనదైన ముద్రతో ముందుకు సాగడం గమనార్హం. ఇక నాగార్జునకు అప్పటికే వెంకటేష్ చెల్లి లక్ష్మితో వివాహం జరిగి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతనే నాగచైతన్య. కాని వారిద్దరు విడిపోవడంతో నాగార్జున అమలను వివాహం చేసుకున్నారు. తాజాగా నాగ్ తనయుడు నాగ చైతన్య, సమంతల ప్రేమ− పెళ్లి పలువురిలో ఆసక్తి కలిగించింది.
‘ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా? నిన్నగాక మొన్న వచ్చి ఏమాయ చేసావే...పిల్లిమొగ్గలేసిందిలా..’’ అంటూ అక్కినేని చిన్నోడు చైతూ అందాలరాశి సమంత ముందు మోకరిల్లి మరీ లవ్ ఎక్స్‌ప్రెస్ చేసాడు. అది సినిమాలోనే కాదు. జీవితంలో కూడా. ప్రేమికుల గుండెచప్పుడిని వెండితెరపై లయబద్ధంగా అనువదించడం తెలిసిన దర్శక మాంత్రికుడు గౌతమ్‌మేనన్. ‘ఏమాయ చేసావే’ చిత్రంలోనే నాయకానాయికలు చైతూ, సమంతల ఆఫ్‌స్క్రీన్ కెమిస్ట్రీకి కూడా అందమైన బీజం పడింది. 2017 సంవత్సరంలో గోవాలో రంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో ఒక్కటైన ఈ ప్రేమికుల జంటకు పెళ్లి తర్వాత వస్తున్న . ‘ప్రేమ’ అనే రసరమ్య లోకంలోకి అడుగుపెట్టిన జంటకి అంతా కొత్తగా మత్తుగా ఉంటుందన్న విషయాన్ని ఓ ప్రేమికురాలిగా సమంత మరోసారి నిరూపించింది. తన సోషల్ యాప్‌ల ద్వారా టాలీవుడ్ యంగ్హీరోతో ప్రేమలో పడ్డట్టు చిన్న చిన్న క్లూలిస్తూ మెయిన్‌స్ట్రీమ్ మీడియా అటెన్షన్ డ్రా చేసింది. వీరిద్దరు వివాహం చేసుకుని ఎంతో ఆనందంగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు.
ఇక సుమంత్, కీర్తిరెడ్డిలు కూడా ఏడేళ్ళపాటు గాఢంగా ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. కానీ ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. వారిదద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో ఇద్దరూ అతి తక్కువ కాలంలోనే విడిపోయారు. ఇక ఈ ఇంట్లో ఆఖరి ప్రేమ అక్కినేని అఖిల్ అపోలో వారి మనవరాలిని ప్రేమించిన విషయం తెలిసిందే. అయితే ఇదీ మూడునాళ్ళ ముచ్చటే అయింది. వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్ళి చేసుకునే వరకు వచ్చేసరికి ఎందుకోగాని వీరి మధ్య కూడా అభిప్రాయబేధాలు రావడం ఆ ప్రేమ ఎంగేజ్మెంట్ వరకే ఆగిపోయింది.