పుట్టింది పెరిగింది అంతా ముంబయిలో. కానీ ఆమెలో తెలుగమ్మాయిని తలపించే ఆహార్యంతో తెలుగింటి ఆడపడుచుగా మారిపోయింది స్నేహ.  ఆమెలో తెలుగుద‌నం ఆ ర‌కంగా ఉట్టిప‌డుతుంది. తెలుగులో ‘తొలి వలపు’, ‘ప్రియమైన నీకు’, హనుమాన్‌ జంక్షన్‌,’ ‘వెంకీ,’ ‘సంక్రాంతి’ ‘రాధాగోపాళం’, శ్రీరామదాసు’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘వినయ విధేయరామ’, వంటి తెలుగు చిత్రాల్లో నటించిన ఈ భామ తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు పలు తమిళ సినిమాల్లో కూడా నటించిన ఈ అందాల తార... అక్కడి ప్రేక్షకులను కూడా అభిమానులుగా మార్చుకుంది. 'అచ్చముండు అచ్చముండు' చిత్రం ద్వారా నటుడు ప్రసన్నతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి,  పెళ్లి ద్వారా ఓ ఇంటివారయ్యారు. ఇరువైపుల పెద్దల అంగీకారంతోనే ఈ వివాహం జరిగింది. 

 

ఇక పై నటించే విషయమై స్నేహదే తుది నిర్ణయమని ప్రసన్న పేర్కొనగా, తానింకా దానిపై ఆలోచించలేదని స్నేహ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆరునెలలు పోరాడి పెళ్లికి పెద్దలను ఒప్పించామని ప్రసన్న చెప్పారు. తాను రెండు సార్లు(నాయుడు, బ్రాహ్మణ సంప్రదాయాల్లో ఒక్కోసారి) తాళి కడుతున్నానని ప్రసన్న తన ఆనందాన్ని మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. పెద్దల మనసును కష్టపెట్టకూడదనే ఉద్దేశ్యంతోనే రెండు సార్లు వివాహం చేసుకుంటున్నామని వారు గతంలో చెప్పారు. స్నేహ తరపున నాయుడు సంప్రదాయంలోనూ, ప్రసన్న కుటుంబం తరపున బ్రాహ్మణ సంప్రదాయంలోనూ వీరి వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళ సినీ పరిశ్రమలోని ప్రముఖులతో పాటు పలువురు తెలుగు సినీ సెలబ్రిటీలు కూడా హాజర‌య్యారు.

 


2012లో ఆమె వివాహం చేసుకోగా వీరి ప్రేమాను బంధాలకు గుర్తుగా 2015ఆగస్టు 10న ‘విహాన్‌’ అనే పండంటి బాబుకు జన్మనిచ్చింది స్నేహ. ఈనేపథ్యంలో తాను మరోసారి అమ్మై ఓ పాప‌కు కూడా జ‌న్మ‌నిచ్చింది. ఇప్పుడు వీరికి ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. భక్తిరస చిత్రాల్లో నటించిన తన ప్రతిభను నిరూపించింది. రామదాసు చిత్రంలో తన నటన అందర్నీ కట్టిపడేసింది. ఎమోషనల్ సీన్స్లో అందర్నీ కంటతడి పెట్టించింది. పాండురంగడు సినిమాలోనూ నటనతో ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: