తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ టైమ్ లో ఎక్కువ పేరు సంపాదించిన హీరో ఎవరు అంటే వెంటనే చెబుతారు.. విజయ్ దేవరకొండ.  లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంతో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ తర్వాత నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రమాణ్యం’ చిత్రంలో కనిపించాడు. యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ‘పెళ్లిచూపులు’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి ’ చిత్రంతో సంచలన విజయం అందుకున్నాడు.  అంతకు ముందు ఈ చిత్రంపై రక రకాల కామెంట్స్ వినిపించాయి.. బోల్డ్ కంటెంట్ ఉందని.. ఈ మూవీ యూత్ ని చెడగొట్టేలా ఉందని.. లిప్ లాక్ సీన్లు బాగా ఉన్నాయని.. చివరికి పోస్టర్స్ పై కూడా పెను వివాదాలు చెలరేగాయి. 

 

ఈ చిత్రం అసలు థియేటర్లో రిలీజ్ అవుతుందా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. కానీ ఈ చిత్రం రిలీజ్ కావడం ఘన విజయం సాధించడం జరిగింది.  ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్ ’ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం రిలీజ్ తర్వాత పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ఇటీవలే ముంబయిలో ప్రారంభమైన విషయం తెలిసిందే.  ఈ చిత్రానికి ‘ఫైటర్ ’ టైటిల్ పెట్టారు.   ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు.

 

సినిమా నిర్మాణంలో ప్రముఖ బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌ కూడా భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.   ఈ చిత్రం మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో కొనసాగబోతుందట. ఇందుకోసం విజయ్ దేవరకొండ థాయ్‌లాండ్‌లో మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. ఈ చిత్రం తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ విడుదల చేసేలా చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. విజయ్ కు ఇది హిందీ డెబ్యూ మూవీగానే చెప్పుకోవాలి.   ఈ చిత్రంలో అనన్యపాండేను హీరోయిన్ గా ఖరారు చేశారు కరణ్ జోహార్. ఈ ముద్దుగుమ్మ ‘ ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2’ చిత్రంతో బాలీవుడ్ కి పరిచయం అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: