సినిమా కథల విషయంలో దర్శకులు లవ్ స్టోరీలనే ఎందుకు ఎంపిక చేసుకుంటారు. ఒక సినిమాను చూసే ఆడియెన్స్ లో యూత్ ఆడియెన్స్ శాతమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అందుకే ప్రేమ కథల్లోనే సరికొత్త కోణంతో సినిమాలు చేస్తున్నారు. అయితే స్టార్ హీరోల సినిమాలైతే అవి వేరేలా ఉంటాయి. మారిన తెలుగు ఆడియెన్స్ యొక్క ఆలోచన ధోరణిని బట్టి ఎలాంటి సినిమా వచ్చినా హిట్ చేస్తారని అనుకున్నారు. కాని కొన్ని సినిమాలు మాత్రం అలా వారికి నచ్చట్లేదు.

 

రీసెంట్ గా వచ్చిన క్లాసిక్ మూవీ జానుని ఆహా.. ఓహో.. అద్భుతమని రివ్యూలు చెప్పినా సగటు ప్రేక్షకుడు మాత్రం ఈ సినిమాకు నెగటివ్ మార్కులే వేశాడు. ఆల్రెడీ తమిళంలో సూపర్ హిట్ అవడం ఆ సినిమాను మన ఆడియెన్స్ కూడా చాలామంది చూడటం లాంటివి జాను సినిమా ఈ ఫలితానికి ప్రధాన కారణాలని చెప్పొచ్చు. అక్కడ విజయ్ సేతుపతి, త్రిషలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇక్కడ శర్వానంద్, సమంతల నటన ఉంది. అయినా కూడా మన ప్రేక్షకులను జాను పెద్దగా ఎక్కలేదు. ఓ విధంగా చెప్పాలంటే ఇదే కథను కమర్షియల్ గా చెబితే ఒకవేళ హిట్ చేసే వారేమో అని అంటున్నారు సిని విశ్లేషకులు.

 

ముఖ్యంగా ఈమధ్య వస్తున్న ప్రేమకథల్లో మినిమం రెండు మూడు ఘాటు ముద్దులు ఉంటున్నాయి. ఇవి లేవు కాబట్టే జాను సినిమా ఫలితం ఇలా ఉండొచ్చని కొందరి అంచనా. అన్ని సినిమాలు ఒకళా ఉండవు.. అన్ని సినిమా కథలు ఒకళా ఉండవు.. ఈ లాజిక్ అర్ధమైతే జాను ఎందుకు ఇలా ఉంది అన్నది అర్ధం చేసుకునే అవకాశం ఉంది. ఇదో ప్యూత్ లవ్ స్టోరీ.. కేవలం మూతి ముద్దుల కోసమో.. పార్కులు పబ్బుల కోసమో.. టైం పాస్ కోసమో ప్రేమించే రోజులవి కాదు. అలాంటి కథను సారీ ప్రేమను అర్ధం చేసుకోనందుకు ప్రేక్షకులను తప్పు పట్టాల్సిన అవసరం లేదు..  వాళ్ళ దురదృష్టం అని వదిలేయడమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: