తెలుగు, తమిళ భాషల్లో హీరో సూర్యకి మంచి క్రేజ్ వుంది. తమిళంతో పాటు తెలుగులోను ఆయన సినిమాలు విడుదలవుతూ ఉంటాయి.  గజినీ సినిమా తర్వాత సింగం సీరిస్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు సూర్య.  తమిళంలో ఏ సినిమా రూపొందినా.. తెలుగు లో తప్పుకుండా రిలీజ్ చేస్తున్నారు.  ఇక తెలుగు లో సైతం సూర్యకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.  తాజాగా సూర్య నటిస్తున్న ‘సూరారై పొట్రు’ తెలుగులో  ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.  ఇటీవల ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల వెంకటేష్ తో గురు మూవీ తీసి మంచి హిట్ అందుకున్న దర్శకురాలు సుధా, ఒక ఆసక్తికరమైన పాయింట్ ని ఈ సినిమా కథగా ఎంచుకున్నట్లు టాక్.  

 

 ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఎక్కువగా బయోపిక్ లు రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తోంది. జేవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని శ్రీనికిత్ బొమిరెడ్డి అందిస్తున్నారు.  నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా నుండి సూర్య మరొక లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.   తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. 'పిల్లా పులి ..' అంటూ ఈ పాట మొదలవుతోంది.

 

'ఎరవేశావే సంకురాతిరి సోకుల సంపదని .. నరికేశావే నా రాతిరి నిద్దరని' అంటూ సాగుతోంది. ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, కథానాయికగా అపర్ణ బాలమురళి అలరించనుంది. కాగా, పైలెట్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవల ఈ మూవీ టీజర్ కూడా మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. 


  

మరింత సమాచారం తెలుసుకోండి: