టాలీవుడ్ రౌడీస్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ తాజా చిత్రం వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజు కానుకగా శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు ముగించుకుని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండటంతో సినిమా ఎలా ? ఉంటుందా అన్న ఆసక్తి సహజంగానే అందరిలోనూ ఉంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు అందమైన అమ్మాయిల తో రొమాన్స్ చేస్తూ ఉండడంతో... ఈ సినిమా చూసేందుకు యువ‌త‌ ఆసక్తి చూపిస్తున్నారు.

 

ఇక విజయ్ నటించిన చివ‌రి రెండు సినిమాలు నోటా, డియ‌ర్ కామ్రేడ్‌ కూడా విజయం సాధించ‌క పోయినా ..  ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ వ‌ర్గాల్లోను విజ‌య్‌కు ఎంత మాత్రం క్రేజ్‌ తగ్గలేదని ఈ సినిమాకు జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ చెప్పకనే చెబుతోంది. వరల్డ్ ఫేమస్ ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా రు 30. 50 కోట్లు జరిగినట్టు తెలుస్తోంది. ఇప్ప‌టి వరకు విజయ్ నటించిన సినిమాల పరంగా చూస్తే డియ‌ర్ కామ్రేడ్‌ సినిమా తర్వాత ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా ఇది రికార్డుల‌కు ఎక్కింది.

 

ఇది విజ‌య్‌కు బిగ్ టార్గెట్టే అని చెప్పాలి. ఈ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న రాశిఖ‌న్నా, కేథ‌రిన్ థెస్రా, ఐశ్వ‌ర్య రాజేష్‌, ఇసాబెల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, వ‌ర‌ల్డ్ వైడ్గా జ‌రిగిన ప్రి రిలీజ్ బిజినెస్ ఇలా ఉంది.

 

వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్ (రూ. కోట్ల‌లో) :

నైజాం - 9 కోట్లు

సీడెడ్ - 4 కోట్లు

ఆంధ్రా - 10 కోట్లు

రెస్టాఫ్ ఇండియా - 4 కోట్లు

ఓవ‌ర్సీస్ - 3.50 కోట్లు
-------------------------------------------------------------
వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ = రు. 30.50 కోట్లు
--------------------------------------------------------------

మరింత సమాచారం తెలుసుకోండి: