షకీలా ఈ పేరు చెబితే ఒకప్పుడు మాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు సైతం వాయిదా వేసుకునేవారని.. అప్పట్లో శృంగార తారగా ఎన్నో సినిమాల్లో నటించి పేరు సంపాదించింది షకీలా.  తెలుగు, తమిళ, కన్నడ, మళియాళ సినిమాల్లో ఒక ట్రెండ్ సృష్టించింది.  అయితే షకీలా తెరపై ఎన్నో శృంగారభరిత పాత్రల్లో నటించి జనాలకు కనువిందు చేసింది.  షకీలా తెరపై కనిపించి ఎంత మందికి కనువిందు చేసినా.. తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలుపడ్డానని పలు ఇంటర్వ్యూలో చెప్పిన విషయంతెలిసిందే.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సొంతవాళ్లే తనను వందల మందిముందు ఘోరంగా అవమాన పరిచారని ఆవేదన వ్యక్తం చేసింది.  తన సొంత అన్న పెళ్లి విషయంలోనే తాను ఘోరమైన అవమానం పొందానని అన్నారు.

 

 తన అన్న పెళ్లికి తనను ఎవరో పరాయి వ్యక్తిని పిలిచినట్లు పిలిచారని.. తర్వాత అక్కడ పెళ్లి కూతురు కూడా తనను చూసి పక్కకు తప్పుకొని తనను అవమాన పరిచిందని బాధపడింది. ఆ తరువాత తను వాష్ రూమ్ కి వెళ్లగానే.. పెళ్లికూతురు మళ్లీ స్టేజ్ ఎక్కిందని చెప్పారు. ఆ తరువాత స్టేజ్ మీదకి వెళ్లి విష్ చేయాలనుకున్న సమయంలో తన సొంత తల్లితండ్రులు స్టేజ్ మీదకు రావొద్దంటూ సైగలు చేశారని అన్నారు.ఆ సమయంలో ఏడుపు కంట్రోల్ చేసుకోలేక అక్కడ నుండి వెళ్లిపోయాయని చెప్పుకొచ్చారు.

 

అప్పుడు నేను పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదని అన్నారు. అప్పటికే తను సినీ పరిశ్రమలో ఎంతో మంచి పేరు ఉందని.. కానీ తనను మాత్రం తన కుటుంబ సభ్యులు చాలా నీచంగా చూసే వారని ఆవేదన వ్యక్తం చేసింది.  తన వారని నమ్మి ఎంతో మోసపోయానని అన్నారు.  ఇవన్నీ గుర్తు చేసుకొని తాను ఎన్నో సార్లు ఒంటరిగా ఏడ్చానని అన్నారు. తర్వాత మా వొదిన నాకు ఫోన్ చేసి మీ అన్నయ్య నన్ను మోసం చేశాడని..  మీ పట్ల అలా ప్రవర్తించినందుకు నాకు తగిన శాస్తే జరిగిందని క్షమించమని కోారారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: