టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ హిట్ మూవీ సరిలేరు నీకెవ్వరు ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్క్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి దాదాపుగా 13 ఏళ్ళ తరువాత ఈ సినిమా ద్వారా టాలీవుడ్ నటిగా రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. 

 

మహేష్ బాబు, మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే రోల్ లో నటించడంతో పాటు, చాలా రోజుల తరువాత మహేష్, ఈ సినిమా ద్వారా తనలోని ఫుల్ లెంగ్త్ కామెడీ యాంగిల్ ని బయటకు తీసి ప్రేక్షకులను అలరించడం జరిగింది. దానితో సినిమా చూసేందుకు ప్రేక్షకులు, ఫ్యాన్స్ బాగా ఎగబడ్డారు. నిజానికి ఈ సినిమాకు మొదట యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ మహేష్ బాబు స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ తో పాటు వరుసగా వచ్చిన సంక్రాంతి సెలవలు ఈ సినిమాకు అద్భుతంగా కలెక్షన్స్ వచ్చేలా చేసాయి. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్ లో డ్యాంగ్ డ్యాంగ్ అనే సాంగ్ మంచి డ్యాన్సింగ్ నంబర్ గా మాస్ ని యువతను ఎంతో ఆకట్టుకుంది. 

 

తమన్నా భాటియా ప్రత్యేకంగా నటించిన ఈ సాంగ్ కు థియేటర్స్ లో ఆడియన్స్ కూడా మంచి రెస్పాన్స్ అందించారు. ఇకపోతే ఈ సాంగ్ కు నేడు సూపర్ స్టార్ మహేష్ తనయ, సితార అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఇక ఆమె డ్యాన్స్ చేసిన వీడియో కాసేపటి క్రితం నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. మంచి జోష్ తో సితార చేసిన ఈ డాన్స్ పై పలువురు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆనందంతో పొంగిపోతూ వీడియోని మరింత వైరల్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: