డియర్ కామ్రేడ్ నిరాశ పరచడంతో డీలా పడ్డట్టు కనిపించిన విజయ్ దేవరకొండ రేపు రిలీజ్ కాబోతున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజబెల్లా హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ సినిమా రిలీజ్ ముందు వరకు పెద్దగా బజ్ ఏర్పడలేదు. రిలీజ్ దగ్గర పడుతున్నా విజయ్ సినిమా సందడి లేదేంటని ఆడియెన్స్ భావించారు. అయితే విజయ్ సినిమా అంటేనే హడావిడి ఆటోమెటిక్ గా వస్తుందని అది తన ఫ్యాన్స్ వల్లే సాధ్యమని అంటున్నాడు విజయ్. 

 

డియర్ కామ్రేడ్ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో నిర్వహించడం జరిగింది.. ఈ వేడుకకు విజయ్ ఫ్యాన్స్ వేలమంది తరలి వచ్చారు. తన కోసం ఇంత మంది ఇలా రావడంపై స్పందించిన విజయ్ ఎప్పటికి మిమ్మల్ని మెప్పించే సినిమాలే చేస్తానని అంటున్నాడు విజయ్. అంతేకాదు తన ప్రతి సినిమా కొత్తగా ట్రై చేస్తానని తన ఫ్యాన్స్ కు హామీ ఇచ్చాడు. 

 

అయితే ఎందుకో కాని ఇండస్ట్రీలో ఈ సినిమాపై నెగటివ్ టాక్ వినిపిస్తుంది. మరి అసలు ఫలితం ఏంటన్నది ఒకరోజు వెయిట్ చేస్తే చాలు. విజయ్సినిమా తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తెలుగుతో పాటుగా తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మళ్ళీ గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా ఉంటుందని తెలుస్తుంది. గీతా గోవిందం, టాక్సీ వాలా సినిమాల తర్వాత విజయ్ తో గీతా ఆర్ట్స్ హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తుంది. ఈ సినిమా దర్శకుడు ఎవరన్నది ఇంకా తెలియలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: