rx 100 సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన కార్తికేయ,  ఆ సినిమాతో ఒక ఐడెంటిటీ ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు కాని పెద్దగా వర్క్ అవుట్ అవలేదు. రీసెంట్ గా వచ్చిన 90ML మూవీ కూడా నిరాశపరచింది. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా పెద్ద బ్యానర్ లో ఛాన్స్ పట్టేశాడు. కార్తికేయ హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మిస్తున్న సినిమా చావు కబురు చల్లగా. 

 

ఈ సినిమాను నూతన దర్శకుడు కౌశిక్ డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమా సెట్స్ మీదకు వెళ్లడమే ఆలస్యం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఓ వ్యాన్  మీద లుంగీ కట్టుకుని స్టైల్ గా సిగరెట్ తాగుతున్న కార్తికేయ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. సినిమాలో లావణ్య హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. 

 

సరైన టైం లో సరైన సినిమా చేస్తున్న కార్తికేయ ఈ సినిమాతో కెరియర్ కు మంచి బూస్ట్ అప్ దొరికేలా ఉంది. rx 100 తర్వాత ఒక్క హిట్టు పడని కార్తికేయ చావు కబురు చల్లగా సినిమాతో కచ్చితంగా హిట్టు కొట్టేలా ఉన్నాడు. సినిమా టైటిల్.. కార్తికేయ ఫస్ట్ లుక్ చూస్తుంటే కార్తికేయ ఈ మూవీతో మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యేలా ఉన్నాడు. 

 

షూటింగ్ మొదలుపెట్టిన రోజే ఫస్ట్ లుక్ వదిలారు అంటే సినిమా అనుకున్న విధంగా అనుకున్న టైం కు రావడం పక్కా అని చెప్పొచ్చు. మరి ఈ బస్తి బాలరాజు ప్రేక్షకుల మనసు గెలుస్తాడా లేడా అన్నది తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కొన్ని సినిమాల ఫలితాలు ఫస్ట్ లుక్ తోనే హిట్ క్రేజ్ తెచ్చుకుంటాయి. అలానే ఈ సినిమా కూడా ఉంటుందని తెలుస్తుంది. కార్తికేయ కాన్ఫిడెన్స్ చూస్తే అది నిజమయ్యేలా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: