విజయ్ దేవరకొండ తెలుగు సినిమా అభిమానులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేని పేరు.. ఎందుకంటే సైలెంట్‌గా తెలుగు సినిమా ఇండ్రస్ట్రీలోకి పెళ్ళి చూపులు పేరుతో వచ్చి, అర్జున్‌రెడ్డి, గీతగోవిందం వంటి సక్సెస్ సినిమాలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ రౌడీ హీరో నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఫిబ్రవరి 14 అంటే రేపు విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్ర బృందం ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతోంది.

 

 

ఈ క్రమంలో విజయ్ తన సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్లు ఇషాబెల్లా, రాశిఖన్నాలతో కలిసి కొన్ని ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇకపోతే ఈ రౌడీ విజయ్ తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఎలాంటి మొహమాటాలు లేకుండా ఓపెన్ గా చెబుతుంటాడు. కానీ కొన్ని సార్లు మాత్రం విజయ్ వేసే సెటైర్లు, బోల్తాపడుతుంటాయి.. ఇకపోతే తాజాగా హీరోయిన్ రాశిఖన్నాపై విజయ్ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

 

 

ఈ సందర్భంగా యాంకర్ రాశిఖన్నాని.. ఛాన్స్ వస్తే ఎవరితో డేట్ చేస్తారని ప్రశ్నిస్తే.. దానికి రాశిఖన్నా డాక్టర్ ఐతే తనను బాగా అర్ధం చేసుకుంటాడని, నటనలో మేం ఎంత బిజీగా ఉంటామో..   డాక్టర్ గా వారు అంతే బిజీగా ఉంటారని బదులిస్తుండగా, మధ్యలో విజయ్ దేవరకొండ అందుకుని, కానీ వాళ్లు మీకు టైం ఇవ్వరు తెలుసా.. అంటూ, నువ్వు కోరుకునే డాక్టర్ నిన్ను నిన్నుగా చూడలేడు.. నీ బుగ్గలు చూస్తే.. ఏదో మెడికల్ టర్మ్ గుర్తొస్తుంది.. అలానే నీ చెస్ట్ ని చూస్తే.. అప్పర్ తొరాక్స్' అంటూ ఇంకా తన బాడీ పార్ట్స్ ని వివరించే ప్రయత్నం చేయగా.. వెంటనే రాశి 'ఏంటి ఇదంతా అర్జున్ రెడ్డి ఫీలా' అంటూ టాపిక్ ని డైవర్ట్ చేసింది.

 

 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఇలా మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయట. కొందరైతే రకరకాలుగా స్పందిస్తుండగా, మరి కొందరు ఓపెన్ గా మాట్లాడడంలో తప్పేముందని అంటుంటే.. ఒక హీరో అయి ఉండి బాధ్యతగా వ్యవహరించడం మానేసి.. ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదంటూ మరికొందరు మాత్రం విజయ్ పై కామెంట్స్ చేస్తున్నారట.. ఏది ఏమైనా యూత్‌లో చాలా ఫాలోయింగ్ ఉన్న ఈ రౌడీ ఇలా మాట్లాడటం ఏంతవరకు సమంజసమో ఆయనే ఆలోచించుకోవాలంటున్నారట నెటిజన్స్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: