గత కొన్నాళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకరితో ఒకరు స్నేహం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో ఏ విధంగా ఉండే వారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం స్నేహగీతం ఆలపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా మనం స్టేజీల మీద ఒకరి సినిమా కార్యక్రమాలకు మరొకరు రావడం, ఒక సినిమా గురించి మరొక‌రు సామాజిక మాధ్య‌మాలు చేయడం వంటివి మధ్య ఎక్కువగా చూస్తున్నాం.  ఈ నేపథ్యంలో కొందరు హీరోలు మరో హీరోకి నిర్మాతగా వ్యవహరించే విధంగా కూడా అడుగులు వేస్తున్నారు.

 

అదే విధంగా చిన్న హీరోలకు కూడా నిర్మాతగా వ్యవహరించాలని భావిస్తున్నారు. ఈ మధ్య సినిమా మార్కెట్ భారీగా పెరిగింది ప్రతి సినిమా వంద కోట్ల టార్గెట్ చేస్తూ వస్తుంది. దీనితో మల్టీస్టారర్ సినిమాల పై దృష్టి పెడుతున్నారు హీరోలు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు - రామ్ చరణ్ కలిసి ఒక వ్యాపారం కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట.  వీరిద్దరి కుటుంబాలు ఎక్కువగా సన్నిహితంగా ఉంటాయి.  చాలా ఫంక్ష‌న్ల‌కు మ‌హేష్ ఫ్యామిలీ, రామ్ చ‌ర‌ణ్ ఫ్యామిలీ క‌లిసే వెళ‌తాయి. న‌మ్ర‌త‌, ఉపాస‌న మ‌ధ్య కూడా ఎంతో అనుబంధం ఉంది.

 

ఆ నేపథ్యంలోనే ఒక బట్టల బ్రాండ్ ని ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నారు. దసరా నుంచి ఈ బ్రాండ్ మార్కెట్లో అందుబాటులో ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఒప్పందాలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. ప్రముఖ బట్టల తయారీ సంస్థ రేమండ్స్ తో వీళ్ళు ఒప్పందం కూడా చేసుకునే ఆలోచనలో ఉన్నారట. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినపడుతోంది.  ప్రస్తుతం ఈ వ్యాపారాన్ని భారత్‌లో లాంచ్ చేసి ఆ తర్వాత విదేశాలకు విస్తరించాలనే యోచనలో ఉన్నారట. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: